Site icon HashtagU Telugu

Justin Greaves: టెస్టుల్లో గ్రీవ్స్ స‌రికొత్త ప్రపంచ రికార్డు.. నంబర్ 6లో బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచ‌రీ!!

Justin Greaves

Justin Greaves

Justin Greaves: న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్.. వెస్టిండీస్ ముందు 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా, విండీస్ జట్టు అద్భుతంగా ఆడి 457 పరుగుల వరకు చేరుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. వెస్టిండీస్ తరఫున జస్టిన్ గ్రీవ్స్ (Justin Greaves) అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించి, కివీ జట్టుకు షాక్ ఇచ్చాడు. గ్రీవ్స్ తన టెస్ట్ కెరీర్‌లో మొట్టమొదటి డబుల్ సెంచరీని నమోదు చేయడంతో పాటు ఒక ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

జస్టిన్ గ్రీవ్స్ డబుల్ సెంచరీ

531 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన జస్టిన్ గ్రీవ్స్ బాధ్యత తీసుకుని డబుల్ సెంచరీ చేసి, న్యూజిలాండ్‌ చేతిలో తన జట్టు ఓడిపోకుండా కాపాడాడు. అతను రెండో ఇన్నింగ్స్‌లో 388 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 19 ఫోర్లు కొట్టాడు.

దీంతో గ్రీవ్స్ ఇప్పుడు వెస్టిండీస్ తరఫున నంబర్ 6 స్థానంలో బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 1993లో పాకిస్తాన్‌పై నంబర్ 6 వద్ద కార్ల్ హూపర్ చేసిన 178 పరుగుల రికార్డును గ్రీవ్స్ బద్దలు కొట్టాడు. అయితే నంబర్ 6 స్థానంలో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్రపంచ రికార్డు ఇప్పటికీ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ 2016లో కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 258 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read: Entertainment : ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలో అతిపెద్ద డీల్

టెస్టుల్లో గ్రీవ్స్ కొత్త ప్రపంచ రికార్డు

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్‌లో 202 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన గ్రీవ్స్ ఒక కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ చరిత్రలో నంబర్ 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ నాల్గవ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ప్రపంచంలోనే మొదటి, ఏకైక బ్యాట్స్‌మెన్స్‌గా అతను నిలిచాడు. ఇంతకుముందు ఈ స్థానం నుండి నాల్గవ ఇన్నింగ్స్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 200 పరుగుల మార్కును చేరుకోలేదు.

నంబర్ 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ నాల్గవ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ఆట‌గాళ్లు వీరే..!

నాల్గవ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ

దీంతో పాటు 21వ శతాబ్దంలో న్యూజిలాండ్‌లో వెస్టిండీస్ తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా జస్టిన్ గ్రీవ్స్ అయ్యాడు. అంతేకాకుండా నాల్గవ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన వెస్టిండీస్ నాలుగో బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. అతనికి ముందు వెస్టిండీస్ తరఫున ఇప్పటివరకు జార్జ్ హెడ్లీ, గోర్డాన్ గ్రీనిడ్జ్, కైల్ మేయర్స్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

నాల్గవ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ తరఫున డబుల్ సెంచరీ

Exit mobile version