2022కు సంబంధించి టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ను ఐసీసీ (ICC Test Team of the Year 2022) ప్రకటించింది. టీ ట్వంటీ, వన్డే జట్లలో సత్తా చాటిన భారత క్రికెటర్లు టెస్ట్ జట్టులో మాత్రం ఒక్కరే చోటు దక్కించుకున్నారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రమే భారత్ నుంచీ ఐసీసీ టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. గత ఏడాది మంచి ఫాంలో ఉన్న పంత్ 12 ఇన్నింగ్స్ లో 61 సగటుతో 680 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.అటు కీపర్ గా కూడా పంత్ బాగానే రాణించాడు. 2022లో అతడు 23 క్యాచ్ లు అందుకోగా, 6 స్టంపింగ్స్ చేశాడు. ఇక ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్సే ఈ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ కు కూడా కెప్టెన్ అయ్యాడు. తన దూకుడైన కెప్టెన్సీతో అతడు ఇంగ్లండ్ ను ముందుండి నడిపించాడు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 9 మ్యాచ్ లు గెలిచింది.
ఆల్ రౌండర్ గా స్టోక్స్ తనదయిన ముద్ర వేశాడు. బ్యాటింగ్ లో రెండు సెంచరీలు సహా 870 రన్స్ చేసిన స్టోక్స్ బౌలింగ్ లో 26 వికెట్లు తీసుకున్నాడు. ఇక టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో స్టోక్స్ తో పాటు ఇంగ్లండ్ కే చెందిన జానీ బెయిర్ స్టో, జేమ్స్ ఆండర్సన్ కు కూడా చోటు దక్కింది. ఆస్ట్రేలియా నుంచి ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ ఎంపికయ్యారు. ఐసీసీ వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఐసీసీ టెస్టు టీమ్‌లోనూ స్థానం సంపాదించుకున్నాడు. బాబర్ ఆజమ్ గత ఏడాది 9 టెస్టులు ఆడి 1184 పరుగులు చేశాడు.
Also Read: Ruturaj Gaikwad: టీ20ల ముంగిట భారత్ కు షాక్.. గాయం కారణంగా ఓపెనర్ గైక్వాడ్ టీ20లకు దూరం
ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022: బెన్ స్టోక్స్ (కెప్టెన్),ఉస్మాన్ ఖవాజా, క్రెగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లబుషేన్, బాబర్ ఆజమ్, జానీ బెయిర్‌స్టో, రిషబ్ పంత్, ప్యాట్ కమ్మిన్స్, కగిసో రబాడా, నాథన్ లియాన్, జేమ్స్ అండర్సన్