Jos Buttler: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ మ్యాచ్‌కు దూరం కానున్న బ‌ట్ల‌ర్‌.. భార్యే కార‌ణ‌మా..?

టీ-20 ప్రపంచకప్‌ కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి తమ దేశానికి తిరిగొచ్చారు.

  • Written By:
  • Updated On - May 25, 2024 / 08:37 AM IST

Jos Buttler: టీ-20 ప్రపంచకప్‌ కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి తమ దేశానికి తిరిగొచ్చారు. ఇందులో ఇంగ్లండ్ కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) పేరు కూడా ఉంది. ఇప్పుడు బట్లర్ గురించి ఓ స్పెషల్ న్యూస్ బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. జోస్ బట్లర్ ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

కారణం ఇదే

ఓ నివేదిక ప్రకారం.. జోస్ బట్లర్ భార్య గర్భవతి. ఆమె మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటువంటి పరిస్థితిలో బ‌ట్ల‌ర్‌ ప్రపంచ కప్‌లోని ఒక మ్యాచ్‌ను కోల్పోవలసి రావచ్చు. ఈ మ్యాచ్ ఏ జ‌ట్టుతో ఉంటుందో ప్రస్తుతానికి వెల్లడించలేదు. జోస్ బట్లర్‌కి ఇద్దరు పిల్లలు. వారి మొదటి కుమార్తె జార్జియా రోజ్ ఏప్రిల్ 2019లో జన్మించింది. రెండవ కుమార్తె మార్గోట్ సెప్టెంబర్ 2021 లో జన్మించింది. మూడేళ్ల తర్వాత మరోసారి తండ్రి కాబోతున్నాడు.

Also Read: Pandya-Natasa: హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వ‌నున్న భార్య న‌టాషా..?

జోస్ బట్లర్ భార్య పేరు లూసీ బట్లర్. ఐపీఎల్ చూసేందుకు ఆమె తన పిల్లలిద్దరితో కలిసి కొన్నేళ్ల క్రితం భారత్‌కు వచ్చింది. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్. బట్లర్ తన కుటుంబానికి సమయం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. బిడ్డ పుట్టిన సమయంలో కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్న‌ట్లు తెలిపాడు. బట్లర్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ మొయిన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

We’re now on WhatsApp : Click to Join

ఇంగ్లండ్ జట్టు గ్రూప్-బిలో ఉంది

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టు గ్రూప్‌ బిలో చోటు దక్కించుకుంది. ఇందులో ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ వంటి జట్లు ఉన్నాయి. జూన్ 4న స్కాట్లాండ్‌తో జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత జూన్ 8న ఆస్ట్రేలియాతో, జూన్ 14న ఒమన్‌తో, జూన్ 15న నమీబియాతో పోటీపడుతుంది. అయితే ఈసారి టైటిల్ కొట్టాల‌నే ల‌క్ష్యంతో ఇంగ్లండ్ జ‌ట్టు బ‌రిలోకి దిగుతోంది.