Jos Buttler: రోహిత్ రికార్డ్ బద్దలు కొట్టిన బట్లర్.. ఆ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీష్ ఆటగాడు

ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ టీ20 క్రికెట్‌లో ఓ మెయిలు రాయిని సాధిం డ్డపై జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో జోస్ బట్లర్ ఈ ప్రత్యేక మైలురాయిని సాధించాడు.

Jos Buttler: ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ టీ20 క్రికెట్‌లో ఓ మెయిలు రాయిని సాధిం డ్డపై జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో జోస్ బట్లర్ ఈ ప్రత్యేక మైలురాయిని సాధించాడు. బట్లర్ ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో చెలరేగాడు. బట్లర్ కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. దీంతో బట్లర్ టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులను పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన బట్లర్ ప్రపంచంలో 8వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన జట్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత జోస్ బట్లర్ నిలిచాడు. టీ20లో 10,000 పరుగులు పూర్తి చేసేందుకు రోహిత్ 362 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సమయంలో బట్లర్ 350వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇక టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. టీ20ల్లో బట్లర్‌ మినహా ఏ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా 10,000 పరుగులు చేయలేదు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రికెట్‌లో గేల్ ఇప్పటివరకు 14,562 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 12,528 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో కీరన్ పొలార్డ్ 12,175 పరుగులతో మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ 11,965 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

Read More: Sahasra Chandra Darshan : సహస్ర చంద్ర దర్శనం.. లైఫ్ లో వెయ్యి పౌర్ణముల విశిష్టత