Jonty Rhodes: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్రీడల నుంచి రాజకీయాలను దూరంగా ఉంచడం ఎంత కష్టమో ఆయన వివరించారు. ఈ గ్లోబల్ టోర్నమెంట్ భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుంది.
‘క్రీడలు- రాజకీయాలు..’ ఈ అంశంపై ఒక కార్యక్రమంలో ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. క్రీడల నుంచి రాజకీయాలను దూరంగా ఉంచుదామని మనం ఎప్పుడూ అనుకుంటాం.. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే మీరు క్రీడలను, రాజకీయాలను వేరు చేయలేరని ఆయన తెలిపారు.
టోర్నమెంట్ నుండి బంగ్లాదేశ్ అవుట్ షెడ్యూల్ ప్రకారం భారత్‌కు వచ్చి ఆడటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ‘భద్రతా కారణాలను’ చూపుతూ నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే బంగ్లాదేశ్ వాదనలో ఎటువంటి పస లేదని భావించిన ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
Also Read: తొలి బడ్జెట్ ఎప్పుడు మొదలుపెట్టారు..? బడ్జెట్ సంప్రదాయాలు ఏంటి ?
స్కాట్లాండ్‌కు లభించిన అవకాశం జనవరి 24, 2026న ఐసీసీ అధికారికంగా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని ధృవీకరించింది. BCBతో మూడు వారాలకు పైగా సాగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఐసీసీ ఆన్‌లైన్ మరియు వ్యక్తిగతంగా పలు సమావేశాలను నిర్వహించింది.
టీ20 వరల్డ్ కప్ కోసం నిరీక్షణ ఈ సందర్భంగా రోడ్స్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు 20 జట్లతో జరుగుతోంది. 20 జట్లతో టోర్నమెంట్‌ను నిర్వహించడం ద్వారా ఐసీసీ అద్భుతమైన పని చేస్తోందని నేను నమ్ముతున్నాను. నేను ఏడాదిలో 5 నెలలు భారతదేశంలోనే ఉంటాను. కాబట్టి నా సొంత ఇంటిలో జరగబోయే వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎవరు గెలుస్తారు లేదా ఎవరు సెమీఫైనల్‌కు చేరుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. టీ20 క్రికెట్‌లో ఒక ఆటగాడు కేవలం 10 నిమిషాల్లోనే ఆట గమనాన్ని మార్చగలడు అని అన్నారు.
