World Cup 2023: ప్రపంచ కప్ టోర్నీలో జో రూట్ విధ్వంసం

వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 6వ సెంచరీని నమోదు చేశాడు.

World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 6వ సెంచరీని నమోదు చేశాడు. 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో జో రూట్ 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గౌరవం అందుకున్నాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

ప్రపంచ కప్ టోర్నీలలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 క్రికెటర్లు
1. జో రూట్- 898
2. గ్రాహం గూచ్- 897
3. ఇయాన్ బెల్- 718
4. అలాన్ లాంబ్- 656
5. గ్రేమ్ హిక్- 635

Also Read: Pawan Kalyan Health : వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్