Site icon HashtagU Telugu

CSK Vs GT Qualifier 1: ధోనీతో అట్లుంటది.. జియో సినిమా రికార్డ్ వ్యూస్

CSK Vs GT

New Web Story Copy 2023 05 24t185237.493

CSK Vs GT Qualifier 1: చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం రాత్రి చెపాక్ మైదానంలో ఐపీఎల్ 2023 ఫైనల్‌కు అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి దర్జాగా ఫైనల్ కు చేరింది. చెన్నై 15 పరుగుల తేడాతో గుజరాత్ పై విజయం సాధించింది. కాగా చెన్నై-గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డిజిటల్ వ్యూస్ తో రికార్డులు బద్దలయ్యాయి.

గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ద్వారా జియో సినిమా ప్రపంచ రికార్డును సృష్టించింది. గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జియో సినిమాలో ఏకకాలంలో 25 మిలియన్ల మంది మ్యాచ్‌ను వీక్షించారు. ఓ వైపు ధోనీ ఉండగా.. మరోవైపు క్వాలిఫయర్ మ్యాచ్ కావడంతోనే ఈ రేంజ్ లో వ్యూస్ వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే చెన్నై మరియు ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షకుల పాత రికార్డును బద్దలు కొట్టింది. ఏప్రిల్ 17న ఆర్సీబీ -చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను జియో సినిమాలో ఏకకాలంలో 24 మిలియన్ల మంది వీక్షించారు. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను జియో సినిమా ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది.

తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు సత్తా చాటారు. సీఎస్‌కే నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టాటిన్స్ 157 పరుగులకు ఆలౌటైంది. జట్టులో శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో సీఎస్‌కే తరఫున రవీంద్ర జడేజా, మహేశ్ తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా, చివరి ఓవర్లలో మతిషా పతిరనా కూడా విధ్వంసం సృష్టించారు.

Read More: GT vs CSK: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్… చెపాక్ లో గుజరాత్ కు చెక్