Site icon HashtagU Telugu

MS Dhoni: ఎంఎస్ ధోనీకి షాకిచ్చిన హైకోర్టు.. కోర్టుకు రావాల్సిందేన‌ని నోటీసులు!

Useful Tips

Useful Tips

MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. దానికి ముందు జార్ఖండ్ హైకోర్ట్ అతనికి వ్యాపార ఒప్పందాలకు సంబంధించి నోటీసు జారీ చేసింది. ధోనీపై వ్యాపారంలో అతని మాజీ భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు. ఈ కేసులో కోర్టుకు హాజరై తన వైఖరిని వివరించాలని ధోనీని హైకోర్టు ఆదేశించింది.

దివాకర్, దాస్ ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లు ధోనీ పేరును ఉపయోగించి క్రికెట్ అకాడమీలను తెరవడానికి మాజీ భారత కెప్టెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తనను మోసం చేశారంటూ ధోనీ ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 5న వారిద్దరిపై క్రిమినల్ కేసు ఫిర్యాదు చేశాడు. 2021లో తాను ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని, అయినప్పటికీ ఇద్దరూ తన పేరును ఉపయోగించడం కొనసాగించారని ధోనీ చెప్పాడు. 15 కోట్ల మేర మోసం చేశార‌ని ధోనీ ఆరోపించాడు. ధోని ఫిర్యాదుపై రాంచీలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇద్దరిపై విచారణ చేపట్టింది. దీనిపై దివాకర్, దాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ, మిహిర్ దివాకర్ మధ్య ఒప్పందం కుదిరింది. 2017 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోనీతో మిహిర్ దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే దివాకర్ ఒప్పందంలోని నిబంధనలను పాటించలేదు.

Also Read: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ పై నిర్మాత కామెంట్స్.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం..

ఒప్పందం ప్రకారం.. ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఫీజులు, లాభాలలో వాటాను కూడా చెల్లించాలి. ఒప్పందం తర్వాత షరతులు పాటించలేదని ఆరోపిస్తూ ధోనీ తరపున రాంచీ సివిల్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. మార్చి 20న మహేంద్ర సింగ్ ధోనీ ఫిర్యాదుపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ పాండే కోర్టు విచారణ చేపట్టింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ వారి సంస్థ ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌కు సమన్లు ​​జారీ చేసి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సివిల్ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులపై మిహిర్ దివాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.