దేశవాళీ క్రికెట్ లో భారత పేసర్ జయదేవ్ ఉనాద్కట్ (Jaydev Unadkat) సూపర్ ఫాన్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న ఉనాద్కట్ తాజాగా అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఢిల్లీతో జరుగున్న మ్యాచ్ లో ఈ సౌరాష్ట్ర పేసర్ తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు. రంజీ చరిత్రలో తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. తొలి బంతికే ఢిల్లీ ఓపెనర్ ధృవ్ షోరేను ఔట్ చేసిన ఉనాద్కట్ రెండో బాల్‌కు వైభవ్ రావల్, మూడో బంతికి కెప్టెన్ యశ్ ధుల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతడి బౌలింగ్ ధాటికి ఢిల్లీ పరుగులు ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయింది. ఈ హ్యాట్రిక్ తోనే ఉనాద్కట్ జోరు ఆగలేదు.
Also Read: Dhamaka Pulsar Bike Song: ‘పల్సర్ బైక్’ పాటతో దుమ్మురేపిన రవితేజ- శ్రీలీల
తన రెండో ఓవర్ లోనే మరో రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీని దెబ్బకొట్టాడు. రెండో ఓవర్‌లో సిద్ధు, లలిత్ యాదవ్‌లను ఔట్ చేశాడు. రంజీ ట్రోఫీలో రెండో ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసుకున్న తొలి బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఉనాద్కట్ ధాటికి ఢిల్లీ 10 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఉనాద్కట్ బౌలింగ్ జోరుకు ఢిల్లీ బ్యాటర్లలో నలుగురు డకౌటయ్యారు. ప్రస్తుతం ఈ సౌరాష్ట్ర పేసర్ 6 వికెట్లు పడగొట్టాడు.