Site icon HashtagU Telugu

Jaydev Unadkat: ఐపీఎల్ నుంచి మరో ఆటగాడు ఔట్.. ఎడమ భుజం గాయం కారణంగా ఉనద్కత్ దూరం

Jaydev Unadkat

Resizeimagesize (1280 X 720) (4)

లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) ఎడమ భుజం గాయం కారణంగా IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఏప్రిల్ 30 ఆదివారం నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌లో ఉనద్కత్ కుప్పకూలిపోయాడు. బౌలింగ్‌లో ఉనద్కత్ బాగా స్లిప్ అయ్యాడు. మొత్తం బరువు అతని ఎడమ భుజంపై ఉంది. దీని వీడియో ఐపీఎల్ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి కూడా షేర్ చేసింది. ఈ సమయంలో ఉనద్కత్ చాలా నొప్పితో కనిపించాడు. జట్టు ఫిజియో అతని గాయానికి ఐస్ క్యూబ్స్ పెట్టడం కనిపించింది.

ESPNcricinfoలోని తాజా నివేదిక ప్రకారం.. జూన్ 7న ది ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జయదేవ్ ఉనద్కత్ సరైన సమయానికి ఫిట్‌గా ఉంటాడు. సమాచారం ప్రకారం జైదేవ్ ఉనద్కత్ స్కానింగ్ కోసం ముంబై వెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు బీసీసీఐ నియమించిన నిపుణుల సలహాదారుల్లో ఒకరిని కలిశాడు. బోర్డులోని వైద్య సిబ్బందితో సంప్రదింపులు జరిపిన లక్నో సూపర్ జెయింట్స్ ఉనద్కత్‌ను ఐపిఎల్ నుండి మినహాయించాలని నిర్ణయించింది. అతను ఆస్ట్రేలియాతో జరిగే WTC ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు ఫిట్‌గా ఉండేందుకు పునరావాసం కోసం బెంగళూరులోని NCAకి వెళ్లాలని భావిస్తున్నారు.

Also Read: Wrestlers Protest: కేంద్ర మంత్రిపై మహిళ రెజ్లర్ సెన్సేషన్ కామెంట్స్

జయదేవ్ గాయపడిన ఒక రోజు తర్వాత, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా మ్యాచ్ రోజు గాయపడ్డాడు. బంతిని వెంబడించడంతో కుడి తొడకు గాయమైంది. జట్టు ఫిజియో, సహచర ఆటగాడి సహాయంతో రాహుల్‌ను మైదానం నుండి బయటకు వెళ్ళాడు. నడవలేని స్థితిలో కొంత సేపు నొప్పులు రావడంతో నేలపైనే పడుకున్నాడు. IPL 2023లోజయదేవ్ ఉనద్కత్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేసి 92 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టులో జయదేవ్ ఉనద్కత్‌కు చోటు దక్కింది. అతను మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు జట్టు బౌలింగ్ లో భాగం. కేఎల్ రాహుల్ కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగమే.