Shami- Rishabh Pant: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడనున్న రిష‌బ్ పంత్‌.. మెగా టోర్నీకి ష‌మీ దూరం..!

భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ (Shami- Rishabh Pant)కి చీలమండ గాయం కారణంగా ఇటీవల విజయవంతమైన శస్త్రచికిత్స జరిగింది.

  • Written By:
  • Updated On - March 12, 2024 / 08:23 AM IST

Shami- Rishabh Pant: భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ (Shami- Rishabh Pant)కి చీలమండ గాయం కారణంగా ఇటీవల విజయవంతమైన శస్త్రచికిత్స జరిగింది. ఇటువంటి పరిస్థితిలో షమీ తన గాయం నుండి కోలుకుంటున్నాడు. దాని కారణంగా అతను IPL 2024లో పాల్గొనలేడు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో షమీ పాల్గొనడం లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా ధృవీకరించారు. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో షమీ పునరాగమనం చేయనున్నాడు. ఇది కాకుండా ప్రపంచ కప్‌లో రిషబ్ పంత్ కోసం తలుపులు తెరిచి ఉన్నాయని జై షా చెప్పాడు.

మీడియా కథనాల ప్రకారం బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో షమీ తిరిగి వస్తాడు. మహ్మద్ షమీ IPL 2024, ICC T20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టులో చేరడని జై షా స్ప‌ష్టం చేశాడు. షమీతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా రిషబ్ పంత్‌కు సంబంధించిన స‌మాచారం కూడా ఇచ్చారు. పంత్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పాడు. పంత్ ఆరోగ్యం కూడా బాగానే ఉంది. త్వరలో ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తాం. అతను జ‌ట్టు కోసం ICC T20 ప్రపంచ కప్ 2024 ఆడగలిగితే అది మాకు మంచి విషయమేన‌ని జై షా చెప్పుకొచ్చారు.

2023 వన్డే ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో షమీకి అవకాశం రాకపోయినా.. హార్దిక్ పాండ్యా గాయపడటంతో షమీకి అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మ్యాచ్‌ల‌ను గెలిపించాడు. ఈ టోర్నీలో షమీకి చీలమండ గాయం అయింది. అయితే అప్పటి నుంచి షమీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. శస్త్రచికిత్స కోసం UK వెళ్ళాడు. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. అక్కడ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ కూడా ష‌మీ ఆడలేడ‌ని షా తేల్చిచెప్పాడు.

Also Read: Tim Southee: కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా..? స‌మాధాన‌మిచ్చిన టిమ్ సౌథీ..!

మహ్మద్ షమీ గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. షమీకి శస్త్రచికిత్స విజయవంతమైంది. అతను కూడా భారత్‌కు తిరిగి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌లో అతను తిరిగి వచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్‌కు ఇంజెక్షన్ అవసరం. NCAలో పునరావాసం కూడా ప్రారంభమైందని పేర్కొన్నాడు.

We’re now on WhatsApp : Click to Join

రిషబ్ పంత్ గురించి జై షా మాట్లాడుతూ.. పంత్ వికెట్ కీపింగ్ చేయగలిగితే అతను ICC T20 ప్రపంచ కప్ ఆడగలడు. అయితే మొదట అతను IPL 2024లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఐపీఎల్ 2024లో ఆడేందుకు పంత్ ఎన్‌సీఎస్ నుంచి అనుమతి పొందడం గమనార్హం. ఐపీఎల్ 2024లో పంత్ ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. దాదాపు ఏడాది సుదీర్ఘ కాలం తర్వాత పంత్ మైదానంలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.