Jay Shah Life Story: బీసీసీఐ సెక్రటరీ జేషా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇండియన్ క్రికెట్లో చాలా మార్పులొచ్చాయి. కుర్రాళ్లకు అవకాశాలు పెరిగాయి. కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ జైశా బీసీసీఐ సెక్రటరీగా మంచి ట్రాక్ రికార్డ్ నెలకొల్పాడు. ఇన్ని రోజులు జైశా కేవలం సగటు క్రీడాభిమానికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అతని గురించి చెప్పుకునేలా చేశాడు. త్వరలో ఐసీసీ చైర్మన్ గా జైశా ఛార్జ్ తీసుకోబోతున్నాడు.
జైశా ఫాదర్ హోమ్ మంత్రి అమిత్ షా అన్న విషయం తెలిసిందే. హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ ఇద్దరూ రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతుంటారు. అయితే అమిత్ షా తనయుడు జైషా గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఐసీసీ పుణ్యమా అని జైశా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. జయ్ షా ఐసీసీ చైర్మన్ కావడంతో అతని గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆరాటపడుతున్నారు. 2019లో జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. బీసీసీఐ కార్యదర్శిగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా మంచి పేరు సంపాదించాడు.
2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యాడు. జై షా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. జే షా 1988 సెప్టెంబర్ 22న జన్మించాడు. 2013లో జై షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2019లో జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యారు. జై షా గుజరాత్‌లో విద్యాబ్యాసం చేశారు. ఇంటర్మీడియట్ తర్వాత నిర్మా యూనివర్సిటీలో బీటెక్ చేశారు.అతని నికర విలువ దాదాపు 124 కోట్లు.జై షా భార్య పేరు రిషితా పటేల్. ఇద్దరూ కాలేజీ స్నేహితులు కావడం విశేషం.జయ్ షా 2015 ఫిబ్రవరి10న రిషితను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిషిత తండ్రి గున్వంత్ భాయ్ పటేల్. అతను కూడా వ్యాపార రంగంలో కొనసాగుతున్నాడు.
Also Read: Haryana Elections 2024: ఎన్నికల ప్రచారంలో చిన్నారి, చిక్కుల్లో బీజేపీ