Arjuna Ranatunga: జై షా జోక్యం వల్లనే శ్రీలంక క్రికెట్ బోర్డు నాశనం.. అర్జున రణతుంగ హాట్ కామెంట్స్ వైరల్..!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జై షాపై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga) తీవ్ర ఆరోపణలు చేశారు.

  • Written By:
  • Updated On - November 14, 2023 / 08:37 AM IST

Arjuna Ranatunga: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జై షాపై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga) తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులపై జై షా ప్రభావం ఉందని రణతుంగ అన్నారు. వీరి కుమ్మక్కు కారణంగానే శ్రీలంక క్రికెట్‌ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.

వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు 9 మ్యాచ్‌లలో 7 ఓడిపోయి 9వ స్థానంలో నిలిచింది. 2025లో జరిగే ICC ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడంలో కూడా విఫలమైంది. 1996లో శ్రీలంకను ప్రపంచకప్ విజేతగా నిలిపిన కెప్టెన్ మాట్లాడుతూ.. శ్రీలంక క్రికెట్‌ను జై షా నడుపుతున్నారు. జై షా ఒత్తిడి కారణంగా మన క్రికెట్ బోర్డు నాశనమైపోతోంది. ఓ భారతీయుడు శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు.

శ్రీలంక బోర్డులో కొనసాగుతున్న గందరగోళం

ప్రపంచ కప్‌లో శ్రీలంక పేలవమైన ప్రదర్శన తర్వాత క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ నవంబర్ 6న శ్రీలంక క్రికెట్ బోర్డును తొలగించారు. తాత్కాలిక బోర్డు కూడా ఏర్పాటైంది. కొత్త తాత్కాలిక బోర్డు ఛైర్మన్‌గా అర్జున రణతుంగ నియమితులయ్యారు. క్రీడా మంత్రి ఆదేశాల మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. క్రీడా మంత్రి నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది. దింతో రణతుంగ తాత్కాలిక అధ్యక్షుడు కాలేకపోయారు.

Also Read: Rahul Dravid : ముంబైకి చేరుకున్న టీమిండియా.. పిచ్‌పై ద్రావిడ్ స్పెషల్ ఫోకస్

శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసింది

శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC)ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శుక్రవారం (నవంబర్ 10) సస్పెండ్ చేసింది. బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సభ్యత్వాన్ని తక్షణమే అమల్లోకి వచ్చేలా ICC రద్దు చేసింది.

రణతుంగ శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు

అర్జున రణతుంగ 1982 నుండి 2000 వరకు అంటే 18 సంవత్సరాల వరకు శ్రీలంక తరపున ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ కూడా అయ్యాడు. 2008 నుండి 2009 వరకు అతను శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. రణతుంగ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. అతను శ్రీలంక ప్రభుత్వంలో నాలుగు మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించాడు. ఆయన చివరిసారిగా 2018-19లో మంత్రిగా పనిచేశారు. ఆయన అప్పుడు శ్రీలంక పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై బీసీసీఐ, ఎస్‌ఎల్‌సీ ఇంకా స్పందించలేదు

రణతుంగ ఆరోపణలపై ఇప్పటి వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భారత క్రికెట్ బోర్డుపై రణతుంగ ఇప్పటికే చాలాసార్లు ఆరోపణలు చేశారు.