Site icon HashtagU Telugu

IPL 2024: ఐపీఎల్ ఇండియాలోనే: రూమర్స్ పై జైషా క్లారిటీ

Ipl 2024

Ipl 2024

IPL 2024: 2024 ఐపీఎల్ ని విదేశాలకు తరలించేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో జరిపిస్తారని కొద్దీ రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జైషా క్లారిటీ ఇచ్చారు.

బీసీసీఐ సెక్రటరీ జైషా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. లీగ్ మొత్తం భారత్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఐపీఎల్ ను విదేశాలకు షిఫ్ట్ చేసే ఆలోచన లేదన్నారు. ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై జూన్ 1న ముగియనున్న సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు మొదటి 21 గేమ్‌ల తేదీలు మాత్రమే ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభం కానుంది.

సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా మరియు 2014లో యుఎఇలో ఐపీఎల్ జరిగింది. అలాగే కరోనా కారణంగా 2020 మరియు 2021లో విదేశాలలో ఐపిఎల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది బీసీసీఐ.

Also Read: Telangana: కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల ప్రక్రియ వేగవంతం