Site icon HashtagU Telugu

IND vs ENG: రెచ్చిపోయిన యార్కర్ కింగ్ బుమ్రా.. వీడియో వైరల్

IND vs ENG

IND vs ENG

IND vs ENG: విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. తొలి సెషన్ లో టీమిండియా బ్యాటింగ్ ముగించగా సెషన్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు తోకముడిచింది. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ని చావుదెబ్బ కొట్టాడు. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్ లో బుమ్రా తీసిన ఓ వికెట్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

యార్కర్ కింగ్ బుమ్రా హాండ్ నుంచి చాలా కాలమ్ తర్వాత బుల్లెట్ లాంటి బంతి దూసుకొచ్చింది. ఈ బంతి వేగానికి రెండు వికెట్లు గాల్లో ఎగిరి పడ్డాయి. చాన్నాళ్ల తర్వాత బుమ్రా డెలివరీలో ఇలా వికెట్లో గాల్లో లేవడం చూశామాని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బుమ్రా త‌న కెరీర్‌లో వేసిన బంతుల్లో ఇదే అత్యుత్త‌మ బంతి అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.విశాఖ తీరంలో జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ తోకముడిచింది. బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు విజ్రంభించడంతో 55.5 ఓవ‌ర్ల‌కు 253 ప‌రుగులకు ఆలౌట్ అయ్యింది . ఫలితంగా భార‌త్ కు 143 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. బుమ్రా డెలివరీలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఓలిపోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

బుమ్రా వేసిన ఓవర్​లో తొలి 4 బంతుల్ని నార్మల్​గా వేసి ఓలిపోప్ ను నమ్మించిన బుమ్రా ఐదో బంతిని తన స్పెషల్ వే లో యార్కర్ సంధించాడు. బుల్లెట్​ స్పీడ్​తో దూసుకొచ్చిన ఆ బాల్​ వికెట్లను తాగడంత్తో రెండు వికెట్లు ఎగిరి పడ్డాయి. బుమ్రా ఇన్‌స్వింగ్‌ యార్క‌ర్ దెబ్బ‌కు ఓలిపోప్ దగ్గర మాటల్లేవ్. మ్యాచ్ లో ఈ వికెట్ హైలెట్ గా నిలిచింది. బుమ్రా అద్భుత‌మైన బౌలింగ్ లో ఓలీ పోప్ బౌల్డ్ అయిన తీరుకు క్రికెట్ ల‌వ‌ర్స్ ఫిదా అవుతున్నారు. నెట్టింట కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ఓలీపోప్‌ను టెస్టుల్లో బుమ్రా ఇప్పటి వ‌ర‌కు ఐదు సార్లు ఔట్ చేశాడు. మ్యాచ్ విషయానికి వస్తే. జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్, ఓలిపోప్ లను ఔట్ చేసి ఇంగ్లాండ్ ను భారీ స్కోర్ చేయకుండా దెబ్బకొట్టాడు. బుమ్రాకు జోడీగా కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతమైన బౌలింగ్ తో మూడు వికెట్లు తీసుకున్నాడు. బెన్ డకెట్, ఫోక్స్, రెహాన్ అహ్మద్ లను పెవిలియన్ కు పంపాడు.

Also Read: Telangana Cabinet Meeting: రేపు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు…