Site icon HashtagU Telugu

IPL 2025: వేలంలోకి బుమ్రా, ఆర్సీబీ ప్రయత్నాలు

IPL 2025, Bumrah

IPL 2025, Bumrah

IPL 2025: ఐపీఎల్ నిబంధనల ప్రకారం మెగా వేలానికి ముందు అన్ని జట్లూ 4 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా.. ఈసారి నిబంధనలు మారబోతున్నాయి. ఇప్పటికే వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ రిటెన్షన్స్ రూల్స్‌ను సిద్దం చేస్తోంది. 10 ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశమై జట్టు ఓనర్ల సలహాలు, సూచనలు విన్నది. మెగా వేలం నేపథ్యంలో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి.

వచ్చే ఐపీఎల్ ఎడిషన్ సమయానికి ఫ్యాన్స్ ఉహించనివిధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఐదు సార్లు జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మను పక్కకునెట్టి ముంబై కెప్టెన్గా హార్దిక్ ని నియమించారు. ఇలాంటి దారుణాల కంటే ఎంతటి హార్డ్ న్యూస్ నైనా ఫ్యాన్స్ జీర్ణించుకోగలరు. తాజాగా నివేదికల ప్రకారం ముంబైకి బుమ్రా గుడ్ బై చెప్పబోతున్నాడట.రోహిత్ ని కాదని హార్దిక్ ని కెప్టెన్ చేయడం బుమ్రా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. బయటకు చెప్పకపోయినా సన్నిహితుల వద్ద బుమ్రా కాస్త అన్ హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తుంది. అంతెందుకు గత ఐపీఎల్ లో ఓ మ్యాచ్ సందర్భంగా బుమ్రా, హార్దిక్ మధ్య వాగ్వాదం జరిగింది. హార్దిక్ సూచనలను బుమ్రా బేఖాతరు చేయడం కనిపించింది.అప్పట్లో దీనికి సంబందించిన వీడియో క్లిప్స్ సెన్సేషన్ గా మారాయి. ఇది కాక పేస్ బౌలర్లకు కెప్టెన్ అవకాశాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బుమ్రా ముంబై వీడుతున్నాడనే వార్తలకు బలం చేకూర్చుతోంది.

ఆర్‌సీబీలోకి వెళ్లేందుకు బుమ్రా సంప్రదింపులు జరుపుతున్నాడు. ఆర్సీబీ ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను వచ్చే సీజన్లో రిటైన్ చేసుకునే అవకాశం లేదు.సో ఆ పోస్ట్ ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలో వేలంలో బుమ్రాను తీసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా మాత్రం కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టులోకి వెళ్లేందుకే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Bandi : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం: బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు