Jasprit Bumrah: రిటైర్మెంట్‌పై బుమ్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఏమ‌న్నాడంటే..?

T20 ప్రపంచ కప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను అతని రిటైర్మెంట్ గురించి అడిగారు. దానికి బుమ్రా T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి ఎప్పుడు రిటైర్ అవుతాడో చెప్పుకొచ్చాడు.

  • Written By:
  • Updated On - July 5, 2024 / 11:02 AM IST

Jasprit Bumrah: ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లకు గురువారం వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం జరిగింది. తొలుత వాంఖడే స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు వందేమాతరం ఆలపించి విజయోత్సవ పరేడ్‌ను ముగించారు. అనంతరం క్రీడాకారులను వేదికపైకి పిలిచి సన్మానించారు. ఈ సమయంలో T20 ప్రపంచ కప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను అతని రిటైర్మెంట్ గురించి అడిగారు. దానికి బుమ్రా T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి ఎప్పుడు రిటైర్ అవుతాడో చెప్పుకొచ్చాడు.

రిటైర్మెంట్‌పై బుమ్రా ఏం చెప్పాడు?

T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు వెటరన్ ఆటగాళ్లు T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఉన్నారు. ఆ తర్వాత బుమ్రా ఇప్పుడు తన రిటైర్మెంట్ గురించి బహిరంగంగా ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. ఇప్పట్లో టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఉద్దేశం లేదని, ఇది తన ఆరంభం మాత్రమేనని బుమ్రా అన్నాడు. ఇంకా ముందుకు వెళ్లాల‌న్నాడు.

Also Read: Virat Kohli Leaves London: లండ‌న్‌కు ప‌య‌న‌మైన కింగ్ కోహ్లీ.. కార‌ణం ఇదేనా..?

ఫైనల్‌లో గెలిచిన తర్వాత బుమ్రా ఏడ్చాడు

జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. సాధారణంగా నేను ఎప్పుడూ ఏడవను కానీ ఈ విజయం నమ్మశక్యం కాదు. నా కొడుకును చూసిన తర్వాత నాలో కలిగిన‌ భావోద్వేగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాను. రెండు మూడు సార్లు ఏడ్చాను అని చెప్పాడు.

ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన

టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ అందించాడు. టీమ్‌ఇండియాకు వికెట్‌ అవసరమైనప్పుడల్లా బుమ్రా వికెట్‌ పడగొట్టాడు. ఈ టోర్నీలో బుమ్రా 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో జస్ప్రీత్ బుమ్రా పాత్ర చాలా ఉంది. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా కూడా ఎంపికయ్యాడు.

We’re now on WhatsApp : Click to Join