T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.

T20 World Cup: ఐపీఎల్ 17వ సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. టాప్-4లో స్థానం కోసం ప్రతి జట్టు పోరాడుతోంది. అయితే.. అసలైన క్రికెట్ అభిమానులు మాత్రం ఐపీఎల్ పై దృష్టి పెట్టడం లేదు. క్రికెట్ ప్రేమికులందరి దృష్టి T20 ప్రపంచ కప్ పై మళ్లింది. T20 ప్రపంచ కప్ జూన్ 2 నుండి అమెరికా మరియు కరేబియన్‌లలో జరుగుతుంది. బీసీసీఐ ఇప్పటికే T20 ప్రపంచ కప్ లో పాల్గొనే టీమ్ ఇండియాను ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

టీ20 ప్రపంచకప్ టీమ్ ఇండియాలో ఎవరో ఒక ఆటగాడు మ్యాచ్ విన్నర్ అవుతాడని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియాకు కీలకం కావచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. కానీ..తన సత్తా చాటితేనే టీమిండియాకు ప్రపంచకప్ సాధ్యమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్లేయర్ ఎవరో కాదు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsAppClick to Join

ఓపెనింగ్, డెత్ ఓవర్లలో బుమ్రా రెచ్చిపోతున్నాడు. బౌన్సర్లు, లెంగ్త్ బాల్స్, స్లో వేరియేషన్, యార్కర్ ఇలా టీ20 బౌలర్‌కు అవసరమైన అన్ని ఆయుధాలు జస్ప్రీత్ బుమ్రా వద్ద ఉన్నాయి. దీంతో టీమ్ ఇండియాకు జస్ప్రీత్ బుమ్రా నిజమైన మ్యాచ్ విన్నర్ గా కొనసాగబోతున్నాడు. అతడితో పాటు మరో బౌలర్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం సాధ్యం కాదని తేలిన తర్వాత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ముంబై మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని కొంతమంది మాజీ క్రికెటర్లు అభిమానులను కోరుతున్నారు. అదే జరిగితే టీమ్ ఇండియాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలుపగలరు.

Also Read: Renuka Chowdhury: ఢిల్లీ పోలీసులకు తడాఖా చూపిస్తాం: రేణుకా చౌదరి