Site icon HashtagU Telugu

Jasprit Bumrah: బూమ్రా రికార్డుల వేట

Jasprit

Jasprit

బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్ తాత్కాలిక కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా రికార్డుల మోత మోగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో రెచ్చిపోయిన బూమ్రా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును సాధించాడు. తాజాగా బంతితోనూ సత్తా చాటుతున్న ఈ పేసర్ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు సంబంధించి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు బూమ్రా 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో 2014 సిరీస్‌లో భువనేశ్వర్ నెలకొల్పిన 19 వికెట్ల రికార్డును అతను అధిగమించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకూ భువి సాధించిన రికార్డే అత్యధికం. గతంలో 2007లో జహీర్‌ఖాన్ 18 వికెట్లు , 2018లో ఇశాంత్ శర్మ 18 వికెట్లు పడగొట్టారు. సాధారణంగా టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల ఘనత స్పిన్నర్లకు దక్కుతుంటుంది. అయితే ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక వికెట్లు జాబితా టాప్‌-5 బౌలర్లలో ఒక్కడే ఉన్నాడు. ఇదిలా ఉంటే బర్మింగ్‌హామ్ టెస్టులో బ్యాట్‌, బంతితోనే కాదు ఫీల్డింగ్‌లోనూ బూమ్రా అదరగొడుతున్నాడు. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్‌ అందుకుని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.

Exit mobile version