Jasprit Bumrah: బుమ్రా సర్జరీ సక్సెస్.. కోలుకునేందుకు 6 నెలలు..!

టీమిండియాకు, జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అభిమానులకు శుభవార్త అందింది. చాలా కాలంగా గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు ఆపరేషన్ విజయవంతమైంది. బుమ్రాకు శస్త్రచికిత్స న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగింది.

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 08:45 AM IST

టీమిండియాకు, జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అభిమానులకు శుభవార్త అందింది. చాలా కాలంగా గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు ఆపరేషన్ విజయవంతమైంది. బుమ్రాకు శస్త్రచికిత్స న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగింది. ఫోర్టే ఆర్థోపెడిక్స్ హాస్పిటల్‌లో డాక్టర్ రోవాన్ షోటెన్ ఈ ఆపరేషన్ చేయగా, ఈ సర్జరీ విజయవంతమైందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఈ శస్త్రచికిత్స తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు మైదానంలోకి వస్తాడు? అనే ప్రశ్న అందరిలో ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి గరిష్టంగా 24 వారాలు అంటే 6 నెలలు పడుతుంది. అంటే జస్ప్రీత్ బుమ్రా ఈ సమయానికి ముందే కోలుకోవచ్చు.

6 నెలల తర్వాత కూడా బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో మైదానంలోకి వస్తే వన్డే ప్రపంచకప్‌లో ఆడగలడు. 2023 ప్రపంచకప్ భారత్‌లో అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా బిగ్ మ్యాచ్ విన్నర్‌లలో బుమ్రా ఒకడు. ఈ ఆటగాడు ఫిట్‌గా మారితే భారత్ విజయావకాశాలు బలంగా మారుతాయి. ఈ సర్జరీ కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్నాడు. దీంతో పాటు సెప్టెంబరులో జరిగే ఆసియాకప్‌లో కూడా అతను పాల్గొనలేడు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఆటగాడు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

Also Read: Delhi Capitals: మళ్ళీ దంచికొట్టిన ఢిల్లీ.. వరుసగా రెండో విజయం

బుమ్రా గత ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ కూడా ఆడలేకపోయాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ సలహా మేరకు జస్ప్రీత్ బుమ్రాను క్రైస్ట్‌చర్చ్‌కు పంపినట్లు వార్తలు కూడా ఉన్నాయి. ఈ ఆటగాడు దానిని ధృవీకరించనప్పటికీ బుమ్రాకు ఆపరేషన్ చేసిన డాక్టర్.. జోఫ్రా ఆర్చర్, జేమ్స్ ప్యాటిన్సన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ వంటి బౌలర్లకు కూడా శస్త్రచికిత్స చేశారు.