India Destroys England: తొలి వన్డేలో టీమిండియా బంపర్ విక్టరీ

ఇంగ్లాండ్ గడ్డపై టీ ట్వంటీ సీరీస్ గెలిచిన జోష్ ను భారత్ కంటిన్యూ చేస్తోంది.

  • Written By:
  • Updated On - July 12, 2022 / 10:13 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై టీ ట్వంటీ సీరీస్ గెలిచిన జోష్ ను భారత్ కంటిన్యూ చేస్తోంది. మూడు వన్డేల సిరీస్ ను గ్రాండ్ విక్టరీతో శుభారంభం చేసింది. ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ భారత పేసర్ల ధాటికి 110 పరుగులకు కుప్పకూలింది. బూమ్ర నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. ఏ ఒక్కరినీ క్రీజులో నిలవనివ్వకుండా షమీ, బూమ్రా ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను దెబ్బ తీశారు.19 రన్స్ కు 6 వికెట్లు తీసిన బుమ్రా తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. షమీ 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో జాస్‌ బట్లర్‌ 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. టీమిండియా బౌలర్ల దాటికి నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. చివర్లో డేవిడ్‌ విల్లీ 21 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌ వంద పరుగులను దాటగలిగింది.

111 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా క్రమంగా పుంజుకుంది. ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో కదం తొక్కగా.. శిఖర్‌ ధావన్‌ 31 పరుగులు చేశాడు. దీంతో 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ 76 , ధావన్ 31 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది.