Site icon HashtagU Telugu

IND vs ENG: మైదానంలో జస్ప్రీత్ బుమ్రా స్లెడ్జింగ్

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి తేసులో భారత్ పై ఇంగ్లాండ్ జట్టు చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో తేలిపోయారు. ఫలితంగా ఉప్పల్ లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో తొలిసారి ఓడింది. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా ఏ దశలోనూ రాణించలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో విఫలం చెందింది. ఇక ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ సెంచరీ చేసి టీమిండియాను చావు దెబ్బ కొట్టాడు. కాగా రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రవర్తించిన తీరు విమర్శల పాలైంది.

ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ చెలరేగిపోవడంతో భారత్ ఒక దశలో ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో మన బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కాగా ఇన్నింగ్స్ లో బుమ్రా స్లేడ్గింగ్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఓలీ పోప్ అసహనం వ్యక్తం చేస్తూ ఎంపైర్ కు కంప్లైంట్ చేశాడు. రోహిత్ వచ్చి ఓలీ పోప్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి కూల్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

జస్ప్రీత్ బుమ్రా 81వ ఓవర్ వేసే సమయానికి ఓలీ పోప్ 156 వ్యక్తిగత పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్ 4వ బంతి వేయగా బంతి వెళ్లి నేరుగా పోప్ ప్యాడ్స్ కు తగిలింది. దీంతో పరుగు తీసే క్రమంలో బుమ్రా అతడికి ఎదురుగా నిలబడ్డాడు. పోప్ అపోజిట్ లో రన్ చేస్తూ వస్తున్నాడని తెలిసినా బుమ్రా సైడ్ ఇవ్వకపోగా తన షోల్డర్ ని ఇంకాస్త పోప్ వైపు జరిపాడు. దీంతో ఇద్దరూ ఢీ కొన్నారు. ఈ విషయంపై పోప్ అసహనం వ్యక్తం చేశాడు. ఆపై అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కలగజేసుకుని పోప్ కు నచ్చజెప్పాడు. అయినా వినకుండా ఇంగ్లాండ్ బ్యాటర్ మరోసారి అంపైర్ తో మాట్లాడాడు. అప్పటికే బుమ్రా తన రెండు చేతులు పైకెత్తి సారీ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి ఇండియన్ ప్లేయర్స్ స్లేడ్గింగ్ కి పాల్పడరు అన్న పేరుంది. ఆస్ట్రేలియా స్లేడింగ్ కు మారుపేరుగా చెప్తారు. అయితే బుమ్రా కావాలనే స్లేడ్గింగ్ చేసినట్లు వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది.

https://twitter.com/i/status/1751464007125594616

Also Read: Health: చెరకు జ్యూస్.. ఆరోగ్యానికి యమ బూస్ట్

Exit mobile version