Site icon HashtagU Telugu

T20I Rankings: జస్ప్రీత్ బుమ్రాకు బిగ్ షాక్.. టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-100లో నో ప్లేస్..!

Jasprit Bumrah

Jasprit Bumrah

T20I Rankings: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా ఆడలేరు. అతని బౌలింగ్ ప్రతిసారీ టీమ్ ఇండియాకు వరంగా మారుతోంది. జస్ప్రీత్ బుమ్రా భారత అత్యుత్తమ బౌలర్‌గా పరిగణించబడటానికి ఇదే కారణం. ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌ (T20I Rankings)లో బుమ్రా టాప్ 100లో కూడా చోటు దక్కించుకోలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని వెనుక ఉన్న కారణాన్ని మనం తెలుసుకుందాం..!

గాయం కారణంగా ర్యాంకింగ్ నుంచి నిష్క్రమించాడు

గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. జూలై 2022లో అతను వెన్నునొప్పితో బాధపడ్డాడు. దీని కారణంగా బుమ్రా చాలా కాలం పాటు మైదానానికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఆసియా కప్ చివరి టీ20 ప్రపంచకప్‌లో కూడా గాయం కారణంగా ఆడలేకపోయాడు. అయినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా ఆగస్టు 2023 నుండి తిరిగి వచ్చాడు. కానీ అప్పటి నుండి చాలా T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. తక్కువ మ్యాచ్‌లు ఆడిన కారణంగా ఐసీసీ టీ20 బుమ్రా అంతర్జాతీయ ర్యాంకింగ్ 110కి చేరుకుంది.

Also Read: Gold- Silver Price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

పాకిస్థాన్‌పై బుమ్రా మ్యాజిక్

ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ ఇచ్చిన 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుతమైన స్పెల్‌కు ఫ్యాన్స్ ఇప్పటికి ప్రసంశలు కురిపిస్తున్నారు. టీమిండియా పాకిస్తాన్‌ను 6 పరుగుల తేడాతో ఓడించడంలో బుమ్రా ముఖ్యమైన పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌పై బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుతమైన ఆటతీరుతో భారత పేసర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ కూడా దక్కింది.

We’re now on WhatsApp : Click to Join

2024 టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ప్రదర్శన

టీ20 ప్రపంచకప్ 2024లో 24వ మ్యాచ్ వరకు జస్ప్రీత్ బుమ్రా రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో బుమ్రా 2.86 ఎకానమీతో 20 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.