Jasprit Bumrah: నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని కోసం పెర్త్‌లో టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పుడు రోహిత్ శర్మకు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. రోహిత్ ఇటీవల రెండోసారి తండ్రి అయ్యాడు. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని అతనిపై ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ తొలి మ్యాచ్ ఆడడని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియాకు కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వ్యవహరించనున్నాడు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ తెలియజేసింది. రెండో టెస్టు మ్యాచ్ నుంచి ఆడనున్నాడు. అయితే రోహిత్ జట్టుకు ఎక్కువ అవసరమని, సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లలో అతను ఉండాలని చాలా మంది మాజీ క్రికెటర్లు రోహిత్ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు రోహిత్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా ఎంపికైనందున ఈ ఆటగాడు ఇప్పుడు పెర్త్ టెస్టులో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Also Read: Pushpa 2 The Rule Trailer: పుష్ప అంటే ఫైర్ కాదు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప-2 ట్రైలర్!
రోహిత్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు
రోహిత్ తన గైర్హజరు విషయాన్ని ఇప్పటికే బీసీసీఐకి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు బీసీసీఐ కూడా రోహిత్ శర్మ రిక్వెస్ట్‌ను అంగీకరించినట్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే రోహిత్ గైర్హాజరీతో ఆస్ట్రేలియాలో ఉండాలని భారత్ ఎ జట్టుతో పర్యటనలో ఉన్న దేవదత్ పడికల్‌ను సెలక్టర్లు కోరారు. పెర్త్‌లోని ఓపస్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ స్థానంలో పడికల్‌ను 18 మంది సభ్యులతో కూడిన జట్టులోకి తీసుకోనున్నారు.
ఇకపోతే ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో ఓడిన టీమిండియా ఎలాగైనా ఆసీస్‌లో గెలవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత సాధించాలని రోహిత్ గ్యాంగ్ ప్రణాళికలు రచిస్తోంది.