Site icon HashtagU Telugu

MI vs DC: ఢిల్లీని దెబ్బ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా

MI vs DC

MI vs DC

MI vs DC: భారీ లక్ష్యఛేదనలో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు ఢిల్లీ ఓపెనర్
పృథ్వీ షా. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ ఢిల్లీ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. మరో  ఓపెనర్
డేవిడ్ వార్నర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టు బాధ్హ్యతను పృథ్వీ షా తీసుకున్నాడు. ఈ క్రమంలో 60 పరుగులతో బాధ్యాయుతంగా ఆడుతూ కనిపించాడు. అయితే పృథ్వీ షా జోరుకు జస్ప్రీత్ బుమ్రా బ్రేకులు వేసి ఢిల్లీని దెబ్బ కొట్టాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. జట్టులో రోహిత్ శర్మ అత్యధికంగా 49 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 42 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39 పరుగులు చేశారు. టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులతో భారీ ఇన్నింగ్స్ అడగా..చివర్లో వచ్చిన రొమారియో షెపర్డ్ ఫోర్లు, సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. షెపర్డ్ కేవలం 10 బంతుల్లో 39 పరుగులతో ముంబై జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు.. షెపర్డ్ కారణంగా 200 వద్ద ఉండాల్సిన స్కోర్ 234కి చేరింది.

We’re now on WhatsAppClick to Join

ఢిల్లీ తరుపున పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ సత్తా చాటారు. పృథ్వీ షా 60 పరుగులు చేయగా, అభిషేక్ 41 పరుగులతో రాణించాడు. డేవిడ్ వార్నర్ 10 పరుగులతో నిరాశపరిచాడు. 235 భారీ టార్గెట్ ముందు ఉంచుకుని వార్నర్ త్వరగా అవుట్ అవ్వడం ఢిల్లీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

Also Read: BRS to TRS : మళ్లీ టీఆర్‌ఎస్‌గా పేరు మార్పు.. ఈ నెల 27న..?