Jasprit Bumrah: ఫాస్ట్ బౌలర్ బుమ్రా గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడు. తాజాగా బీసీసీఐ బుమ్రా హెల్త్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీంతో బుమ్రా త్వరలోనే జట్టులో భాగం కాబోతున్నట్టు అర్ధం అయింది. తాజాగా బుమ్రా పునరాగమనానికి సంబంధించి బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఐర్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ లో బుమ్రా ఆడతాడని షా క్లారిటీ ఇచ్చారు.బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, ఐర్లాండ్‌కు తాను ఆడొచ్చని జై షా విలేకరుల సమావేశంలో తెలిపారు. బుమ్రా వెన్నుముక శస్త్రచికిత్స తర్వాత NCAలో పునరావాసం పొందుతున్నాడు.
ప్రస్తుతం టీమిండియా విండీస్ పర్యటనలో ఉంది. రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడిన టీమిండియా విండీస్ పై ఆధిపత్యం సాధించింది. ఇక మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ లైనప్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇషాన్ కిషన్ మినహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. విండీస్ కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచడంతో టీమిండియాకు విజయం సులువుగా మారింది.
Also Read: PM Modi: జీవవైవిధ్యం పరిరక్షించడంలో భారత్ కృషి మరువలేనిది: పీఎం మోడీ