Site icon HashtagU Telugu

Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా ఈజ్ బ్యాక్

Bumrah On Fire

Bumrah On Fire

జనవరి 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాలో భారీ మార్పు చోటు చేసుకుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా బుమ్రా సెప్టెంబర్, 2022 నుంచి టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. అయితే.. ఇప్పుడు బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. శ్రీలంకతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చింది.

ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు ఇది అతిపెద్ద శుభవార్త. ఎందుకంటే బుమ్రా చాలా కాలంగా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను భారత సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చిందని బీసీసీఐ మీడియా ప్రకటన విడుదల చేసింది. ”శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టులోకి పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చేర్చింది” అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.

బుమ్రా సెప్టెంబర్, 2022 నుండి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను వెన్ను గాయం కారణంగా ICC పురుషుల 2022 T20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడు. ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ తిరిగి గాయం నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) చేత ఫిట్‌గా ప్రకటించబడ్డాడు. దింతో బుమ్రా కొద్దిరోజుల్లో టీమిండియా వన్డే జట్టులో చేరనున్నాడు.

Also Read: India Beat SL: అదరగొట్టిన శివమ్ మావి తొలి టీ ట్వంటీ భారత్‌దే

శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా (VC), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.