Jasprit Bumrah- Sanjana Ganesan: భర్తను ఇంటర్వ్యూ చేసిన భార్య.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బుమ్రా కపుల్..!

Jasprit Bumrah- Sanjana Ganesan: జస్ప్రీత్ బుమ్రా తన శక్తివంతమైన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను గెలిపించాడు. భారత్‌ను ఆరు పరుగుల తేడాతో గెలిపించాడు. ఈ ప్రదర్శన తర్వాత అందరూ బుమ్రాను ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే బుమ్రా స్పెల్ లేకుంటే 2024 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ భారత్‌ను సులభంగా ఓడించి ఉండేది. ఈ అద్భుతమైన ఆట తర్వాత బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా తన భార్య సంజనా గణేషన్‌ (Jasprit Bumrah- […]

Published By: HashtagU Telugu Desk
Jasprit Bumrah- Sanjana Ganesan

Jasprit Bumrah- Sanjana Ganesan

Jasprit Bumrah- Sanjana Ganesan: జస్ప్రీత్ బుమ్రా తన శక్తివంతమైన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను గెలిపించాడు. భారత్‌ను ఆరు పరుగుల తేడాతో గెలిపించాడు. ఈ ప్రదర్శన తర్వాత అందరూ బుమ్రాను ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే బుమ్రా స్పెల్ లేకుంటే 2024 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ భారత్‌ను సులభంగా ఓడించి ఉండేది. ఈ అద్భుతమైన ఆట తర్వాత బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా తన భార్య సంజనా గణేషన్‌ (Jasprit Bumrah- Sanjana Ganesan)కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారత జట్టులో పేరున్న ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకరు. అయితే క్రికెట్‌లో చేరడానికి ముందు వ్యాఖ్యాత సంజనా గణేశన్ జీవితం కూడా పూర్తిగా భిన్నమైనది. సంజన ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసింది. 2012లో ఫెమినా మిస్ ఇండియా స్టైల్ దివా పోటీల్లో సంజనా గణేశన్ పాల్గొని ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచే ఆమె కెరీర్ మళ్లీ మొదలైంది. 6 మే 1991లో జన్మించిన సంజనా గణేశన్ ఒక ప్రసిద్ధ క్రీడా వ్యాఖ్యాత. ఆమె మోడలింగ్ కూడా చేసేది. ఆమె తరచుగా భారతదేశంలో వివిధ క్రీడా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఉంటూ వస్తుంది.

Also Read: Rain Forecast : ఇవాళ 13 జిల్లాలకు.. రేపు 18 జిల్లాలకు వర్ష సూచన

జస్ప్రీత్ బుమ్రా-సంజనా గణేశన్ 2013 IPL సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో సంజన జస్ప్రీత్ బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది. ఈ భేటీ తర్వాత వారిద్దరూ స్నేహితులయ్యారని, అయితే దీని తర్వాత వారి మధ్య చాలా కాలంగా ఎలాంటి సంభాషణ జరగలేదని సమాచారం. సంజన, జస్‌ప్రీత్‌ల ప్రేమకథ చాలా చిత్రమైనది. చాలా కాలంగా వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను మీడియాకు దూరంగా ఉంచారు. 2021లో జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ నుండి వైదొలగవలసి వచ్చినప్పుడు వారి ఎఫైర్ వార్తలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి అభిమానులకు శుభవార్త అందించారు.

జస్ప్రీత్, సంజన పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేశారు. వారిద్దరూ 15 మార్చి 2021న గోవాలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహంలో సిక్కు సంప్రదాయాలను పాటించారు. ఆసియా కప్ 2023 సందర్భంగా జస్ప్రీత్ బుమ్రాకు కొడుకు పుట్టాడు. సెప్టెంబర్ 4, 2023న, జస్ప్రీత్ తండ్రి అయ్యాడు. తన కొడుకుకి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టాడు.

We’re now on WhatsApp : Click to Join

 

  Last Updated: 11 Jun 2024, 08:13 AM IST