Site icon HashtagU Telugu

Jasprit Bumrah: బూమ్రా కంటే మా షాహీనే గొప్ప బౌలర్: రజాక్

Jasprit Bumrah

Jasprit Bumrah

వీలు దొరికినప్పుడల్లా భారత్ క్రికెట్ పైనా, భారత క్రికెటర్ల పైనా నోరు పారేసుకోవడం పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళకు మామూలే. ఒక్కోసారి వారి మాటలు కోటలు దాటుతుంటాయి. హద్దు మీరి వ్యాఖ్యలు చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా పాక్ మాజీ బౌలర్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బూమ్రాను అవమానించేలా మాట్లాడాడు. అతనో బేబీ బౌలర్ అని, తమ బౌలర్ షాహీన్ అఫ్రిది స్థాయికి దరిదాపుల్లో కూడా లేడని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు కూడా అయిన రజాక్.. ఓ స్థానిక న్యూస్ ఛానెల్ తో ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి బుమ్రాపై రజాక్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ అతన్ని ఓ బేబీ బౌలర్ అంటూ రజాక్ అవమానించాడు.

తాను గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి గొప్ప బౌలర్లతో ఆడాననీ, అందువల్ల తన ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్ అంటూ అప్పట్లో రజాక్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి అటువంటి కామెంట్స్ చేయడంతో భారత అభిమానులు మండిపడుతున్నారు. భారత క్రికెటర్ల పై కామెంట్స్ చేసి పబ్లిసిటీ పొందుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: Murali Vijay: అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ గుడ్ బై

టీమిండియా క్రికెటర్లపై వ్యాఖ్యలు చేయకుంటే వారికి పూట గడవదంటూ ఎద్దేవా చేస్తున్నారు. షాహీన్ అఫ్రిది కూడా మంచి బౌలరే అయినా బూమ్రా స్థాయితో పోల్చలేమంటూ భారత అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే బుమ్రా వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలోనే సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకూ దూరమైన బూమ్రా తర్వాతి మ్యాచ్ లకూ అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది.

Exit mobile version