Jasprit Bumrah: భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 14న ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శన చేసి ఆర్ అశ్విన్ పేరిట ఉన్న ఒక ముఖ్యమైన రికార్డును బద్దలు కొట్టాడు.
ఆర్. అశ్విన్‌ను దాటేసిన బుమ్రా
ఈ మ్యాచ్‌లో రియాన్ రికెల్టన్‌ను అవుట్ చేయడం ద్వారా జస్‌ప్రీత్ బుమ్రా ఒక గొప్ప ఘనత సాధించాడు. ఈ వికెట్‌తో కలిపి భారత్ తరఫున బుమ్రా క్లీన్ బౌల్డ్ ద్వారా సాధించిన వికెట్ల సంఖ్య 152కు చేరింది. తద్వారా అతను 151 క్లీన్ బౌల్డ్ వికెట్లు తీసిన ఆర్. అశ్విన్‌ను అధిగమించాడు.
ఈ జాబితాలో అగ్రస్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నారు. అతను 186 వికెట్లను క్లీన్ బౌల్డ్ ద్వారా తీశారు. కుంబ్లే తర్వాత కపిల్ దేవ్ 167 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈ విజయంతో బుమ్రా ఇప్పుడు ఈ జాబితాలో మూడవ అత్యధిక క్లీన్ బౌల్డ్ వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు.
Also Read: Jubilee Hills Bypoll Result : రికార్డు సృష్టించిన నవీన్ యాదవ్
159 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
భారత జట్టు కేవలం 159 పరుగులకే సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేసింది. ఈ వార్త రాసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో బుమ్రా 5 వికెట్లు తీయగా.. సిరాజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మరో గొప్ప ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లను అత్యధిక సార్లు అవుట్ చేసిన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.
2018 సంవత్సరం నుండి ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సార్లు ఓపెనర్లను అవుట్ చేసిన రికార్డు ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. ఈ కాలంలో అతను 12 సార్లు ఈ ఘనత సాధించాడు. అయితే సౌత్ ఆఫ్రికాపై తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా తన ప్రారంభ స్పెల్‌లోనే ప్రత్యర్థి జట్టు ఇద్దరు ఓపెనర్ల వికెట్లను తీసి ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం గత 7 సంవత్సరాలలో టెస్ట్ క్రికెట్‌లో 13 సార్లు ఓపెనర్లను అవుట్ చేసిన నంబర్-1 బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
