World Cup 2023: ప్రపంచకప్‌లో 9వ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. బౌలర్ల పటిష్ట ప్రదర్శన తర్వాత రోహిత్ శర్మ (131) భీకర ఫామ్ అఫ్ఘాన్ బౌలింగ్‌ను పూర్తిగా దెబ్బతీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 272 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చింది. కానీ తొలి పవర్‌ప్లేలో జస్ప్రీత్ బుమ్రా బాగా బౌలింగ్ చేశాడు. ఇబ్రహీం జద్రాన్‌కు బుమ్రా పెవిలియన్ దారి చూపించాడు. జద్రాన్‌ను అవుట్ చేసిన తర్వాత బుమ్రా తలపై వేలు పెట్టుకుని వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. అయితే బుమ్రా చూపించిన ఈ సిగ్నేచర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మార్కస్ రాష్‌ఫోర్డ్ ఇలానే చేసేవాడు. బుమ్రా అతడిని కాపీ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మార్కస్ రాష్‌ఫోర్డ్ కూడా గోల్ కొట్టిన తర్వాత తలపై వేలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటాడు. వికెట్ తీసిన తర్వాత బుమ్రా కూడా రాష్‌ఫోర్డ్‌ను కాపీ కొట్టి సంబరాలు చేసుకున్నాడు.
మరోవైపు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఫుట్‌బాల్ ఆటగాడి సిగ్నేచర్ ని కాపీ కొట్టాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను సిరాజ్ కాపీ కొట్టాడు. వికెట్ తీసుకున్న తర్వాత సిరాజ్ రెండు చేతులు చాచి గాలిలో దూకి సంబరాలు చేసుకుంటాడు. క్రిస్టియానో రొనాల్డో గోల్ చేసిన తర్వాత ఇలానే సంబరాలు చేసుకుంటాడు.
Also Read: Daily Walking : రోజూ వాకింగ్ చేస్తున్నారా ? ఎన్ని అడుగులు నడవాలంటే..