Bumrah: వారెవ్వా బుమ్రా.. యువీని గుర్తు చేశావ్

బర్మింగ్‌హామ్ టెస్టులో రిషబ్ పంత్, జడేజా బ్యాటింగ్‌ను మించి మరో ఆటగాడు అందరినీ ఆకట్టుకున్నాడు.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 10:52 PM IST

బర్మింగ్‌హామ్ టెస్టులో రిషబ్ పంత్, జడేజా బ్యాటింగ్‌ను మించి మరో ఆటగాడు అందరినీ ఆకట్టుకున్నాడు. టాపార్డర్‌ బ్యాటర్‌లా ప్రత్యర్థి బౌలర్‌పై విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. అతనెవరో కాదు టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా.. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఊహించని విధంగా ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ ఓవర్లో బ్రాడ్ 35 పరుగులు సమర్పించుకున్నాడు. బూమ్రా ఇలాంటి బ్యాటింగ్ చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. బ్రాడ్ వేసిన ఆ ఓవర్ తొలిబంతికి ఫోర్ కొట్టగా… రెండో బాల్‌కు వైడ్‌ సహా 5 పరుగులు వచ్చాయి. తర్వాతి బంతిని సిక్సర్‌ కొట్టగా.. అది నోబాల్‌గా నమోదైంది. ఆ తర్వాత వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అనంతరం చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు.

దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 35 పరుగులు వచ్చాయి. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌లో 2003లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా చేసిన 28 పరుగులే అత్యధికం. తాజాగా ఈ రికార్డును బుమ్రా బద్దలుకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో బూమ్రా , మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ను గుర్తు చేశాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లోనే యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్ చెత్త రికార్డు నెలకొల్పాడు. తాజాగా టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.