Site icon HashtagU Telugu

Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్‌?

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. రోహిత్ శర్మ జ‌ట్టు నుంచి త‌ప్పుకున్న‌ తర్వాత జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్ రెండో రోజు జస్ప్రీత్ బుమ్రా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా స్కాన్ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ సమయంలోనే బుమ్రా స్కాన్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

బుమ్రా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఇప్పుడు ఫాస్ట్ బౌలర్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్ ఎడిటర్ సాహిల్ మల్హోత్రా ప్రకారం.. బుమ్రా బ్యాటింగ్ చేయడానికి బాగానే ఉన్నాడు. కానీ అతని బౌలింగ్‌పై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. అతను ఎలా భావిస్తున్నాడో చూడాలని పేర్కొన్నారు.

Also Read: Shyamala : సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు

రెండో రోజు కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు

సిడ్నీ టెస్టు రెండో రోజు జస్ప్రీత్ బుమ్రా కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో అతను వికెట్ల‌ను కూడా తీశాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. ఇటువంటి పరిస్థితిలో మొత్తం జట్టు, భారత అభిమానులు బుమ్రా బౌలింగ్ చేయడానికి పూర్తిగా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు.

రెండో రోజు భారత్ 145 పరుగుల ఆధిక్యం సాధించింది

రెండో రోజు ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రెండో రోజు టీమిండియా తరుపున రిషబ్ పంత్ 61 పరుగులతో పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. ప్ర‌స్తుతానికి క్రీజులో ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు. భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌల‌ర్ బోలాండ్ 4 వికెట్లు తీయ‌గా.. క‌మిన్స్‌, వెబ్ స్ట‌ర్ చెరో వికెట్ తీశారు.