Site icon HashtagU Telugu

James Anderson: భారత్‌ను ఓడించి ఇంగ్లండ్‌ ఛాంపియన్‌ అవుతుంది.. జోస్యం చెప్పిన అండర్సన్..!

ODI World Cup 2027

World Cup 2023

James Anderson: ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) జోస్యం చెప్పాడు. ఈ అంచనాలో ఏ జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయో..? ఫైనలిస్ట్ జట్లు, ఛాంపియన్‌గా మారే జట్టు పేర్లను కూడా చెప్పాడు. ఈ సమయంలో అండర్సన్.. భారతదేశం, పాకిస్తాన్ గురించి కూడా ముఖ్యమైన విషయాలను కూడా చెప్పాడు.

బీబీసీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అండర్సన్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్ జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయన్నాడు. పాకిస్థాన్‌ సెమీస్ కి దగ్గరగా వస్తుంది కానీ కానీ సెమీ-ఫైనల్‌కు చేరుకోలేదు అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ జట్టు పరిస్థితి కూడా పాక్ జట్టులాగే ఉంటుందన్నాడు. ఇంగ్లండ్‌, భారత్‌లు వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరుకుంటాయని, కఠినమైన మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఇంగ్లండ్‌ ఛాంపియన్‌ అవుతుందని భావిస్తున్నాని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో అండర్సన్ దక్షిణాఫ్రికా జట్టును మెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా ప్రదర్శన నాకు నచ్చింది. జట్టు బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా మంచి ఎంపికలను కలిగి ఉందని చెప్పాడు.

Also Read: Vande Bharat: వందే భారత్‌లో స్లీపర్‌ కోచ్ లు భలే ఉన్నాయే! ఫొటోలు వైరల్!!

We’re now on WhatsApp. Click to Join.

జేమ్స్ ఆండర్సన్‌తో పాటు ఇతర క్రికెట్ నిపుణులు కూడా బీబీసీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంగ్లిష్‌ మాజీ బౌలర్‌ జోనాథన్‌ ఆగ్న్యూ భారత్‌ను చాంపియన్‌గా పేర్కొంటూ న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌కు చేరుకుంటుందని పేర్కొన్నాడు. మహిళల ప్రపంచకప్ విజేత అలెక్స్ హార్ట్లీ కూడా టీమ్ ఇండియా ఛాంపియన్ అవుతుందని జోస్యం చెప్పారు. భారత్‌తో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లను సెమీఫైనల్‌కు పోటీదారులుగా అభివర్ణించాడు. వ్యాఖ్యాత అతిఫ్ నవాజ్ ఇంగ్లండ్ విజేతగా, భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా సెమీ-ఫైనలిస్టులుగా అంచనా వేశారు. అదే సమయంలో టైమల్ మిల్స్ పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించాడు. వెస్టిండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా ఎంచుకున్నాడు.