Site icon HashtagU Telugu

James Anderson Retirement: ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ రిటైర్మెంట్‌కు ముహూర్తం ఫిక్స్‌..!?

James Anderson Retirement

Safeimagekit Resized Img (3) 11zon

James Anderson Retirement: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఈ ఏడాది వేసవి తర్వాత రిటైర్మెంట్ (James Anderson Retirement) ప్రకటించే అవకాశం ఉంది. ది గార్డియన్ నివేదికలో ఈ క‌థ‌నం పేర్కొన్నారు. దీని గురించి అండర్సన్.. ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో మాట్లాడినట్లు నివేదికలో పేర్కొంది. అండర్సన్‌ను వ్యక్తిగతంగా కలవడానికి మెకల్లమ్ న్యూజిలాండ్ నుండి UKకి వెళ్లారు. ఇంగ్లిష్ క్రికెట్ మేనేజ్‌మెంట్ అతని భవిష్యత్తును పరిశీలిస్తోందని తెలుస్తోంది.

అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్

అండర్సన్ తన కెరీర్‌లో ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన భారత్‌లో పర్యటించారు. గత మ్యాచ్‌లో 700 టెస్టు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచంలో మూడో బౌలర్‌గా నిలిచాడు. అతని వయస్సు 41 సంవత్సరాలు. జులైలో అతడికి 42 ఏళ్లు వ‌స్తాయి. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ తర్వాత అండ‌ర్స‌న్ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా శ్రీలంక సిరీస్ ప్రారంభం కానుంది. ఇది అండర్సన్ హోమ్ గ్రౌండ్.

Also Read: Kalki 2898 AD : ఏపీ ఎన్నికల వల్ల.. ప్రభాస్ ‘కల్కి’ మూవీ వర్క్స్‌కి బ్రేక్.. నిర్మాత వైరల్ పోస్ట్..

మార్చిలో భారత్‌తో చివరి టెస్టు ఆడాడు

జేమ్స్ అండర్సన్ ఈ ఏడాది మార్చిలో భారత్‌తో తన చివరి టెస్టు ఆడాడు. కాగా చివరి ODI మార్చి 2015లో, T-20 ఇంటర్నేషనల్ నవంబర్ 2009లో ఆడాడు. అండర్సన్ 187 టెస్టు మ్యాచ్‌లు ఆడి 348 ఇన్నింగ్స్‌ల్లో 700 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 194 మ్యాచ్‌లు ఆడి 269 వికెట్లు, 19 టీ-20 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. అండర్సన్ 2003లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడు

ప్రపంచంలో అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడు అండర్సన్. సచిన్ టెండూల్కర్ అతని కంటే ముందున్నాడు. గతేడాది కూడా అండర్సన్ రిటైర్మెంట్ గురించి చాలా చర్చలు జరిగాయి. ఆ తర్వాత వేసవిలో ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అండర్సన్ తన భవిష్యత్తు గురించి జరుగుతున్న చర్చను శనివారం బ‌హిర్గ‌తం చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టు 2025లో భారత్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌లో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో యాషెస్‌ను నిర్వహించనున్నారు.