CPL:కరేబియన్ ప్రీమియర్ లీగ్ విజేత జమైకా తలైవాస్

కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ విజేతగా జమైకా తలైవాస్ నిలిచింది. ఫైనల్లో జమైకా 8 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ పై విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 03:12 PM IST

కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ విజేతగా జమైకా తలైవాస్ నిలిచింది. ఫైనల్లో జమైకా 8 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బార్బడోస్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు మేయర్స్ , కార్నవాల్ 6 ఓవర్లలోనే 63 పరుగులు జోడించారు. వీరిద్దరూ వెంటనే వెంటనే ఔటైనా… అజామ్ ఖాన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అయితే చివరి ఓవర్లలో బార్బడోస్ బ్యాటర్లు అనుకున్నంత వేగంగా ఆడలేకపోయారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది.

జమైకా బౌలర్లలో ఫాబియస్ అలెన్ 3 , గోర్డాన్ 3 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్ లో జమైకా తలైవాస్ తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. వికెట్ కీపర్ లూయీస్ డకౌటయ్యాడు. అయితే బ్రాండన్ కింగ్ రెచ్చిపోయాడు. మరో బ్యాటర్ బ్రూక్స్ తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 9 ఓవర్లలోనే 86 పరుగులు జోడించారు. బ్రూక్స్ 33 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయగా.. కింగ్ మాత్రం చివరి వరకూ జోరు కొనసాగించాడు. బ్రాండన్ కింగ్ కేవలం 50 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 83 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో జమైకా 16.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. జమైకా టైటిల్ గెలవడం ఇది మూడోసారి. గతంలో 2013, 2016 సీజన్లలో తలైవాస్‌ టీమ్‌ సీపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది.తలైవాస్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.