Site icon HashtagU Telugu

Yashasvi Jaiswal : ఢిల్లీ గడ్డపై జైస్వాల్ శతకం..!

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

ఢిల్లీ గడ్డపై సెంచరీతో మెరిసిన జైస్వాల్, తన కెరీర్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులో అత్యంత ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీల తర్వాత యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పాడు..

భారత్ – వెస్టిండీస్ రెండో టెస్టు మొదటి రోజు సెకండ్ సెషన్లో టీమిండియా జోరు కొనసాగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో ఆడి టీమిండియా స్కోర్ను పరుగులు పెట్టించాడు. 145 బంతుల్లో సెంచరీ చేసిన జైస్వాల్. 16 ఫోర్లు బాదిన జైస్వాల్ ఒక్క సిక్సర్ నమోదు చేయలేదు.

టీమిండియా వన్డే, టీ20 జట్టులో చోటు కోల్పోయిన యశస్వి జైస్వాల్ ప్రస్తుతం టెస్టులకే పరిమితమయ్యాడు. టెస్టు ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు. ఇప్పటి వరకు 25 టెస్టుల్లో 47 ఇన్నింగ్స్లు ఆడిన జైస్వాల్ కెరీర్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. మొదటి సెషన్లో 94 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా.. రెండో సెషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ బౌండరీలతో విండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్.. టెస్టు కెరీర్లో తన స్థానాన్ని సుస్థిరపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Exit mobile version