Site icon HashtagU Telugu

Rohan Bopanna: బోపన్నకు జై.. 43 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్​స్లామ్ విన్

Rohan Bopanna

Rohan Bopanna

Rohan Bopanna: టెన్నిస్​ స్టార్ రోహన్ బోపన్న మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ డబుల్స్‌ విభాగంలో తన సహచరుడు మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో బోపన్న విజయ దుందుభి మోగించారు. ఇటలీ జోడీ సిమోన్‌-వావాసోరిపై ఎబ్డెన్‌, బోపన్న జంట విజయాన్ని నమోదు చేసింది.  దీంతో కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను బోపన్న తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్‌లో 7-6 (7/0), 7-5 తేడాతో వరుస సెట్లలో రోహన్‌ జోడీ జయకేతనం ఎగరేసింది. దీంతో 43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన టెన్నిస్‌ ప్లేయర్‌గా బోపన్న నిలిచాడు. ఇటీవల టెన్నిస్‌ డబుల్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన రోహన్‌ బోపన్నను(Rohan Bopanna) పద్మశ్రీ అవార్డు సైతం వరించింది. గురువారం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల్లో క్రీడారంగం నుంచి ఏడుగురు ఎంపికయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో గురువారం రోహన్‌ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌ జోడీ 6-3, 3-6, 7-6 (10/7)తో జాంగ్‌-మచక్‌ జంటపై విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా.. టైబ్రేకర్‌లో బోపన్న ద్వయం పైచేయి సాధించింది. 2013లో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన బోపన్నకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. అయితే ఈసారి ఆయన ఉన్న డబుల్స్ టీమ్ గెలిచి చూపించింది.

Also Read :NTR Devara: దటీజ్ తారక్.. ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ హావా

టెన్నిస్ ప్ర‌పంచంలో ఆమెరికా, రష్యా, జెకోస్లొవికియా, స్వీడెన్‌ల‌దే ఆధిప‌త్యం.. భార‌త క్రీడాకారులు సానియా మీర్జా, రోష‌న్ బొప్ప‌న్న‌లు కొన్ని టైటిల్స్ గెలిచి మ‌న‌దేశ ఉనికిని చాటారు. అయితే ఇంత వ‌ర‌కూ మ‌న‌దేశానికి చెందిన క్రీడాకారులు ఎవ్వ‌రూ టాప్ ర్యాంక్ లోకి రాలేక‌పోయారు. తాజాగా ఆ కొర‌త‌ను తీర్చేశాడు భారత స్టార్‌ ప్లేయర్‌ రోహన్ బోపన్న. 43 ఏళ్ల పెద్ద వయసులో డబుల్స్ విభాగంలో నంబర్ వన్‌ ర్యాంకర్‌గా అవతరించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకుకు చేరుకోవడంపై బోపన్న స్పందించాడు. ”నా 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వారాలపాటు టోర్నీలు ఆడుతూ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. భారత్‌ తరఫున టాప్‌ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. టీమ్ మొత్తానికి క్రెడిట్‌ వస్తుంది. కుటుంబం, కోచ్‌, ఫిజియో.. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఇది భారత టెన్నిస్‌కు అత్యంత ముఖ్యం. మరింత మంది క్రీడాకారులు రావడానికి మార్గం చూపిస్తుందని భావిస్తున్నా” అని వ్యాఖ్యానించాడు.

Exit mobile version