IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటి. అయిదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గత ఎడిషన్ లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమి కోట్లాది మంది సిఎస్కె అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలన్న వాళ్ళ కల చెదిరింది.
వచ్చే సీజన్లో ధోనీ ఆడటంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సమయంలో చెన్నై అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్‌లోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు తమ రిటైర్మెంట్‌ను ప్రకటించబోతున్నారు. టి20 ప్రపంచ కప్ అనంతరం పొట్టి ఫార్మేట్ కు రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ తమ రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా రవీంద్ర జడేజా ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. జడేజా టి20 ప్రపంచ కప్ లో 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 35 పరుగులు మాత్రమే చేశాడు. ఆల్ రౌండర్ అయిన జడ్డు కేవలం 1 వికెట్ మాత్రమే తీయ్యడం గమనార్హ. దీనిని పరిగణనలోకి తీసుకుంటే జడేజా వచ్చే ఐపీఎల్ ఎడిషన్ లో ఆడకాపోవచ్చు. గత సీజన్‌లో కూడా జడేజా ప్రదర్శన నామానంత్రంగానే సాగింది. అటు ఎంఎస్ ధోని కూడా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
మహి రిటైర్మెంట్ గురించి గత కొన్ని సీజన్లుగా వార్తలు వస్తున్నప్పటికీ అతను ప్రతిసారీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు. అయితే గత సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీనికి కారణం అతని కాలికి అయిన గాయం. అంతేకాదు వయసు కూడా సహకరించడం లేదు.అందుకే ధోనీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. సో మొత్తానికి వచ్చే ఐపీఎల్ సీజన్ లో జడేజా, ధోనీ లేని చెన్నై జట్టుని చూడబోతున్నాం.