Site icon HashtagU Telugu

Virat Kohli: అశ్విన్‌ రిటైర్‌మెంట్‌పై విరాట్‌ కోహ్లి భావోద్వేగం!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జరిగే మూడో టెస్టు తర్వాత టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ తన చివరి మ్యాచ్ పింక్ బాల్ టెస్టును అడిలైడ్‌లో ఆడాడు. గబ్బా టెస్టులో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. గబ్బా టెస్టు డ్రా అయిన వెంటనే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భావోద్వేగానికి లోనయ్యాడు. అతని సోషల్ మీడియా ఖాతాలో అశ్విన్‌తో త‌న‌కున్న బంధాన్ని పంచుకున్నాడు. కోహ్లీ ఏం రాశారో తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ ఎక్స్‌లో అశ్విన్ గురించి ఇలా వ్రాశాడు. నేను మీతో 14 సంవత్సరాలు క్రికెట్ ఆడాను. ఈ రోజు మీరు రిటైర్ అవుతున్నారని నాకు చెప్పినప్పుడు అది నన్ను కొద్దిగా భావోద్వేగానికి గురి చేసింది. మీతో ఆడిన గత సంవత్సరాల జ్ఞాపకాలు నాకు వచ్చాయి. మీతో ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భారత క్రికెట్‌కు మీ నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ సహకారం మరెవరికీ లేదు. మీరు భారతీయ క్రికెట్‌కు లెజెండ్‌గా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు అని భావోద్వేగానికి గుర‌య్యారు. గబ్బా టెస్ట్ సమయంలోనే అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి విరాట్‌తో చెప్పాడని, ఆ తర్వాత విరాట్ వెంటనే అతనిని కౌగిలించుకున్నాడు. దాని వీడియో కూడా వైరల్ అవుతోంది.

Also Read: Bhuvanagiri : విద్యార్థినితో వంట చేయించిన ప్రిన్సిపాల్.. నూనె పడి గాయాలు

అశ్విన్ ఓ లెజెండ్

రవిచంద్రన్ అశ్విన్ ఓ ఓజీ, లెజెండ్ అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడారు. రాబోయే తరం బౌలర్లకు ఆయన స్ఫూర్తి అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘భారత్ క్రికెట్ కాకుండా ప్రపంచ క్రికెట్ కూడా అశ్విన్ సేవలు కోల్పోయింది. మా ఇద్దరి మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అశ్విన్ ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. ఆయనకు, ఆయన కుటుంబానికి ఆల్ ది బెస్ట్’ అని ఆయన పేర్కొన్నారు.

భారతదేశం తరపున ఆర్ అశ్విన్ తన పేరిట చాలా రికార్డులు సృష్టించాడు. అంతేకాదు భారత్ తరఫున అత్యధిక వికెట్లు (537) తీసిన రెండో బౌలర్ అశ్విన్. ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన 7వ బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ బ్యాట్‌తో టెస్టుల్లో మొత్తం 6 సెంచరీలు కూడా ఉన్నాయి. అశ్విన్ బంతితో పాటు తన బ్యాట్‌తో జట్టుకు బలమైన ప్రదర్శన ఇచ్చాడు.