Virat Kohli Message: అమెరికా పిచ్ లకు నేను సరిపోనా.. టీ ట్వంటీ వరల్డ్ కప్ పై కోహ్లీ కామెంట్స్

ఐపీఎల్ లో కోహ్లీ (Virat Kohli Message) మరోసారి తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు.

Published By: HashtagU Telugu Desk
KKR Approaches Rahul Dravid

KKR Approaches Rahul Dravid

Virat Kohli Message: ఐపీఎల్ లో కోహ్లీ (Virat Kohli Message) మరోసారి తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు. 49 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ ఆటను ప్రమోట్ చేయడానికి కేవలం తన పేరు మాత్రమే వాడుతున్నారన్నాడు.. తనలోలో ఆట ఇంకా మిగిలే ఉందంటూ విమర్శకులకు చురకలు అట్టించాడు.

ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ క‌ప్‌కు విరాట్ కోహ్లిని తప్పించే యోచనలో బీసీసీఐ ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. అమెరికా పిచ్ లు కోహ్లీ ఆటకు సరిపోవని, పూర్తి యువ జట్టునే పంపించాలనుకుంటున్నట్టు అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. దీనిపై పరోక్షంగా స్పందించిన కోహ్లీ తనలో షార్ట్ ఫార్మాట్ కు తగ్గట్టు ఆడే సత్తా ఇంకా తగ్గలేదన్నాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ ఫ్యాన్స్ కూడా విమర్శకులకు కౌంటర్ ఇస్తున్నారు. ఛేజింగ్ కింగ్ గా పేరున్న విరాట్ నే వరల్డ్ కప్ కు తప్పిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే వేగంగా ఆడాలా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Rohit Sharma Holi: చిన్న పిల్లాడిలా మారిపోయిన టీమిండియా కెప్టెన్‌.. హోలీ రోజు రోహిత్ ఏం చేశాడో చూడండి..?

గత టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ లో కోహ్లీ కనిపించలేదు. కేవలం వన్డేలు, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్ కప్ లో రోహిత్ , కోహ్లీ ఆడతారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆసీస్ తో సిరీస్ కు కూడా వీరిద్దరినీ ఎంపిక చేశారు. అయితే కోహ్లీ విషయంలో మాత్రం సెలక్టర్లు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది.

We’re now on WhatsApp : Click to Join

వరల్డ్ కప్ కు ఎక్కువమంది యువక్రికెటర్ల వైపే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా కోహ్లీ ఇప్పటి వరకూ 117 టీ ట్వంటీల్లో 4037 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకవేళ ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం కోహ్లీ జోరు ఇలాగే కొనసాగితే బీసీసీఐ తన ఆలోచన మార్చుకోవాలేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 26 Mar 2024, 01:07 PM IST