Site icon HashtagU Telugu

David Warner: వార్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 2024 వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడతా..!

David Warner out of final two India Tests with elbow fracture

Blow After Blow For The Australia.. Warner Is Out

తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని సెలెక్టర్లు నిర్ణయిస్తే 2024 వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడతానని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) తెలిపాడు. ఈ ఏడాది యాషెస్‌ సిరీస్‌లో జట్టుకు ఎంపికవుతానన్న ఆశాభావం వ్యక్తం జేశాడు. మోచేతి గాయం కారణంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించిన వార్నర్‌ గురువారం స్వదేశానికి చేరుకున్నాడు.టీమిండియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో వార్నర్‌ విఫలమయ్యాడు. వరుసగా 1, 10, 15 స్కోర్లు రాబట్టాడు. కంకషన్‌ కారణంగా ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను ఆడలేదు.

మోచేయి ఫ్రాక్చర్ కారణంగా అతను భారత పర్యటనలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. మిగిలిన రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఆయన గురువారం సిడ్నీ చేరుకున్నారు. ఢిల్లీ టెస్ట్‌లో వార్నర్ గాయంతో బాధపడ్డాడు. రెండవ రోజు ఆట ప్రారంభానికి ముందు మ్యాచ్ నుండి వైదొలిగాడు. అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మాట్ రెన్షా వచ్చాడు. 36 ఏళ్ల వార్నర్ గత మూడేళ్లలో ఒకే ఒక్క టెస్టు సెంచరీ చేశాడు.

Also Read: World Cup Run Outs: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్‌..!

ఇటీవల వార్నర్ విలేకరులతో మాట్లాడుతూ.. 2024 వరకు ఆడతానని ఎప్పుడూ చెబుతుంటా. టెస్టుల్లో నా స్థానానికి అర్హుడిని కాదని సెలెక్టర్లు భావిస్తే ఫర్వాలేదు. అప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారిస్తా. రాబోయే 12 నెలల్లో జట్టు చాలా క్రికెట్‌ ఆడనుంది. పరుగులు సాధిస్తున్నంత కాలం నా స్థానాన్ని కాపాడుకోగలను. అది జట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 36 నుంచి 37వ వయసులోకి వెళ్తున్న ఆటగాడి పట్ల విమర్శలు సహజం. గతంలో మాజీ ఆటగాళ్ల విషయంలోనూ ఇలాగే జరిగిందని వార్నర్‌ పేర్కొన్నాడు. వార్నర్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్, అష్టన్ అగర్ కూడా భారత పర్యటనకు దూరమయ్యారు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 0-2తో వెనుకబడి ఉంది.