Rohit Sharma: 2023 ప్రపంచకప్‌లో జట్టులోకి రాని ఆటగాళ్లపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) విలేకరుల సమావేశంలో స్పందించాడు. నేను కూడా ఈ బాధను అనుభవించాను అని రోహిత్ చెప్పాడు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో 2023 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది.
విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘జట్టులో కేవలం 15 మంది ఆటగాళ్లకు మాత్రమే చోటు ఉంటుంది. కొందరు ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. నేను కూడా ఈ బాధను అనుభవించాను. అందుకే నేను ఈ బాధను అనుభవించగలను. మాకు చాలా ఎంపికలు ఉన్నాయి. అయితే ఈ 15 బెస్ట్.’’ అని తెలిపారు. ప్లాన్‌కి సంబంధించిన ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ.. నేను ఇంకా ఎలాంటి ప్లాన్ చేయలేదు. ఎవరు ఫామ్‌లో ఉన్నారో, ఎవరు ఎలా ఆడుతున్నారో చూడాలి. ఏది బెస్ట్ కాంబినేషన్ అనేది చూడాల్సి ఉంది అని బదులిచ్చాడు రోహిత్.
Also Read: India World Cup Squad: వన్డే వరల్డ్‌కప్.. భారత జట్టు ప్రకటన.. బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే..!
2011 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ శర్మ పేరు ఎక్కువగా చర్చకు రావడం గమనార్హం. కానీ అతడిని టీమ్ ఇండియాలో చేర్చలేదు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో రోహిత్ సభ్యుడు కాదు. అతని స్థానంలో పీయూష్ చావ్లాకు అవకాశం కల్పించారు. ఈ కారణంగానే జట్టులోకి ఎంపిక కాలేదనే బాధ తనకు అర్థమవుతోందని రోహిత్ విలేకరుల సమావేశంలో తెలిపాడు.
బ్యాటింగ్ కోసం భారత్ జట్టులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్‌లను జట్టులోకి తీసుకున్నారు. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉన్నారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది.
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై వేదికగా నిలవనుంది. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్.. 2015, 2019 ఎడిషన్‌లలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు మరోసారి స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండటంతో టీమిండియాపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.