Ind – Pak Match : వారే ఈ విజయానికి కారణం…ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమన్న రోహిత్

ఏ దశలోనూ పాక్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మరోసారి మెగా టోర్నీలో మన అజేయమైన రికార్డును రోహిత్ సేన కొనసాగిస్తూ దుమ్మురేపింది

  • Written By:
  • Updated On - October 14, 2023 / 11:12 PM IST

వన్డే ప్రపంచకప్ ((2023 World Cup)) హైవోల్టేజ్ మ్యాచ్ లో అదరగొట్టిన టీమిండియా పాక్ (India wins against Pakistan by 7 wickets) పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచి పాక్ (Pakistan ) ను చిత్తు చేసింది. ఏ దశలోనూ పాక్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మరోసారి మెగా టోర్నీలో మన అజేయమైన రికార్డును రోహిత్ సేన (Captain Rohit Sharma) కొనసాగిస్తూ దుమ్మురేపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సహచర ఆటగాళ్లపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా బౌలర్లే ఈ అద్భుతమైన విజయానికి కారణమని కితాబిచ్చాడు.

ఎంతో ఒత్తిడి ఉండే మ్యాచ్ లో బౌలర్లు సత్తా చాటారన్నాడు. నిజానికి అహ్మదాబాద్ పిచ్ 190 పరుగులు చేయాల్సిన పిచ్‌ కాదన్న రోహిత్ ఒన జక దశలో పాక్ 280 పరుగులు చేసేలా కన్పించిందని అంగీకరించాడు. మిడిలార్డర్‌లో బాబర్‌, రిజ్వాన్‌ నిలదొక్కుకున్న సమయంలో తమ బౌలర్లు బంతితో మ్యాజిక్ చేశారని రోహిత్ చెప్పాడు.

తాను ఏ బౌలర్‌ చేతికి బంతి ఇస్తే వారే వికెట్లు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. పరిస్థితికి తగ్గట్టు బౌలర్లను ఉపయోగించడం తన బాధ్యతని, ప్రత్యర్ది జట్టు, బ్యాటర్లను బట్టి బౌలర్లను మారుస్తూ వచ్చానని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే బౌలర్లు కూడా రాణించారని, క్రమం తప్పకుండా వికెట్లు తీసారన్నాడు. అటు బ్యాటర్లు కూడా చక్కగా ఆడారన్నాడు. వరల్డ్‌కప్‌కు వచ్చేముందు ప్రతీ ఒక్కరూ మంచి ఫామ్‌లో ఉన్నారన్న భారత కెప్టెన్ సరైన ప్రణాళికలతోనే ఈ టోర్నీ బరిలోకి దిగామని చెప్పాడు. తమ బ్యాటింగ్‌ ఆర్డర్ పై ఒక క్లారిటీ ఉందని, అది లోస్కోర్‌ మ్యాచ్‌ అయినా, హైస్కోరింగ్‌ మ్యాచ్‌ అయినా బ్యాటింగ్‌ అర్డర్‌లో ఎటువంటి మార్పు ఉండదన్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే తర్వాతి మ్యాచ్ లపై కూడా రోహిత్ స్పందించాడు. వరుసగా విజయాలు సాధిస్తున్నా ప్రతీ మ్యాచ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నామని చెప్పాడు. ఈ టోర్నీలో ఏ జట్టును కూడా తేలికగా తీసుకోమని రోహిత్ స్పష్టం చేశాడు. ఎందుకంటే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో ఆడుతున్నప్పుడు ప్రతీ జట్టు తమదైన రోజును గట్టి పోటీఇవ్వగలదన్నాడు. అయితే తాము మాత్రం ఈ నిలకడైన ఆటతీరును కొనసాగిస్తూ ముందుకు సాగుతామని చెప్పాడు. ప్రస్తుతం మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా తర్వాతి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది. పుణే వేదికగా ఈ
మ్యాచ్ అక్టోబర్ 19న జరుగుతుంది.

Read Also : Ind – Pak Match : ఇండియా – పాక్ మ్యాచ్ దెబ్బకు స్విగ్గీ రికార్డు స్థాయిలో బిర్యానీ ఆర్డర్స్