ISPL Registration: ISPL టోర్నీ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు?

మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ముందుగా రెజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ISPL అధికారిక సైట్ ని లాగిన్ అయి జనవరి 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు

ISPL Registration: మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ముందుగా రెజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ISPL అధికారిక సైట్ https://www.ispl-t10.com/registration-user సైట్ ని లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకోవాలి. తొలుత రిజిస్ట్రేషన్ చివరి తేదీ డిసెంబర్ 20 కాగా ఇప్పుడు ఆ తేదీని కాస్త పొడిగించారు.ఇప్పుడు జనవరి 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి 1179ని 18 శాతం జీఎస్టీతో కలిపి చెల్లించి రిజస్టర్ చేయాల్సి ఉంటుంది.

ఈ టోర్నమెంట్ లో ముంబైతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఈ ఆరు జట్లను ఆరు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అయితే ఈ టోర్నీ ద్వారా టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ఆయన ఐఎస్​పీఎల్​లో టీమ్ హైదరాబాద్​ జట్టును కొనుగోలు చేశారు.ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్ లు కాగా, అన్నీ ముంబైలో నిర్వహిస్తారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 16 మంది ఆటగాళ్లతో పాటు ఆరుగురు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఒక్కో ఫ్రాంఛైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం కోటి రూపాయల పరిమితి ఉంటుంది. వేలంలో ఒక్కో ప్లేయర్ కనీస ధర 3 లక్షలుగా నిర్ణయించారు. ఈ వేలం ఫిబ్రవరి 24న జరగనుంది.

Also Read: Thandel : సముద్రం మధ్యలో ‘తండేల్‌’.. త్వరలో ఎగ్జైటింగ్ అప్‌డేట్స్