Cricket Coincidences: వికెట్లు తియ్యడంలో వీరికి వీరే సాటి

టీమిండియా-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మాజీ బౌలర్ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ వెటరన్ బౌలర్లు కామెంటరీ చేస్తూ ఉండగా వారి కెరీర్లో తీసిన వికెట్ల ప్రస్తావన వచ్చింది

Published By: HashtagU Telugu Desk
Cricket Coincidences

New Web Story Copy (37)

Cricket Coincidences: టీమిండియా-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మాజీ బౌలర్ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ వెటరన్ బౌలర్లు కామెంటరీ చేస్తూ ఉండగా వారి కెరీర్లో తీసిన వికెట్ల ప్రస్తావన వచ్చింది. దీంతో జియో సినిమా జహీర్, ఇషాంత్ తీసిన వికెట్ల వివరాలను స్క్రీన్ పై చూపించింది. ఇక అంతే క్షణాల్లో వైరల్ గా మారింది. ఎందుకంటే వారి కెరీర్లో తీసిన వికెట్ల సంఖ్య, విదేశీ గడ్డపై ఆడిన మ్యాచ్ లు, స్వదేశీ గడ్డపై తీసిన వికెట్లు సరిసమానంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది.

యాదృచ్ఛికమో లేక విచిత్రమో గానీ ఈ లెజెండరీ ఆటగాళ్లు తమ కెరీర్లో సరిసమానంగా వికెట్లను తీశారు. జహీర్ ఖాన్ తన కెరీర్‌లో 311 టెస్ట్ వికెట్లు తీస్తే, ఇషాంత్ శర్మ కూడా సరిగ్గా 311 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ తన కెరీర్‌లో 11 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్ల ఘనతను అందుకోగా.. ఇషాంత్ శర్మ కూడా 11 సార్లు 5 వికెట్లు.. ఒక్కసారి 10 వికెట్లను తీసుకున్నాడు. స్వదేశంలో జహీర్ ఖాన్ 104.. విదేశాల్లో 207 వికెట్లు తీస్తే.. ఇషాంత్ శర్మ కూడా భారత్‌లో 104, ఓవర్‌సీస్‌లో 207 వికెట్లు తీశాడు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఖంగుతిన్నారు. ఒకటి రెండు విషయాల్లో యాదృచ్ఛికం జరగవచ్చు, కానీ ఈ లెజండరీ ఆటగాళ్ల క్రికెట్ కెరీర్ మొత్తం సమానంగా ఉండటం నెటిజన్స్ ని ఫిదా చేసింది.

Also Read: Jagan : సీఎం పదవిలో ఉండి నిరుపేదల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నాడు – గంటా శ్రీనివాస్

  Last Updated: 25 Jul 2023, 02:03 PM IST