Site icon HashtagU Telugu

PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ .. మైదానం వీడిన ఇషాంత్ శర్మ

Pbks Vs Dc

Pbks Vs Dc

PBKS vs DC: ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కాగా చేజింగ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ తొలి విజయం సాధించింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ కూడా తొలుత బౌలింగ్ తో శుభారంభం చేయడంతో శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఢిల్లీకి బిగ్ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇషాంత్‌కు ఈ గాయం అయింది. బౌండరీ లైన్‌లో బంతిని ఆపిన తర్వాత ఇషాంత్ పైకి లేస్తుండగా అతని కాలు మెలితిరిగింది. ఆ సమయంలో ఇషాంత్ నొప్పితో కనిపించాడు. నొప్పిని భరించలేక నేలపై పడుకున్నాడు. దీంతో సహచరులు అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే ఇషాంత్ రాబోయే మ్యాచ్ ల్లో ఫిట్ గా లేకుంటే ఢిల్లీకి పెద్ద దెబ్బే.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అభిషేక్‌ పోరెల్‌ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో పోరెల్ రెండు సిక్సర్లు, 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. అభిషేక్ కేవలం 10 బంతుల్లో 32 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. షాయ్ హోప్ 25 బంతుల్లో 33 పరుగులు చేశాడు. పంత్ పటిష్టమైన ఆరంభాన్ని అందించాడు. కొన్ని మంచి షాట్లు కొట్టాడు, కానీ పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. పంత్ 13 బంతుల్లో 18 పరుగులు చేసిన తర్వాత హర్షల్ పటేల్‌కు బలయ్యాడు. ఢిల్లీ కెప్టెన్ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు కొట్టాడు.

Also Read: Pawan Kalyan: పవన్ ముద్దుల కూతురి క్యూట్ వీడియో చూసారా!