Site icon HashtagU Telugu

Ishan Kishan: జట్టులో చోటు దక్కని ఇషాన్ కిషన్.. బీసీసీఐపై విమర్శలు

Ishan

Resizeimagesize (1280 X 720) 11zon

టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఇటీవల బంగ్లాదేశ్‌పై వన్డే క్రికెట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీ చేశాడు. ఆపై ఇషాన్ టీమిండియా జట్టులో ఎంపిక అయినా ప్లేయింగ్ ఎలెవన్ లో కనిపించలేదు. ఇప్పుడు శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను టీమిండియా 2-0తో చేజిక్కించుకుంది. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన ఆట డెడ్-రబ్బర్‌గా ఉండటంతో టీమిండియా బెంచ్ బలాన్ని పరీక్షించవచ్చని, కిషన్‌కి అవకాశం లభిస్తుందని టీమిండియా ఫ్యాన్స్ భావించారు. కానీ ఇషాన్ అవకాశం దక్కలేదు. కిషన్ XI నుండి లేకపోవడంతో బీసీసీఐని అభిమానులు విమర్శిస్తున్నారు. చివరి వన్డేలో భారత్ రెండు మార్పులు చేసింది. ఉమ్రాన్ మాలిక్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చి, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు కల్పించింది. అయితే ఇప్పటికే సిరీస్ గెలిచినా టీమిండియా 3వ వన్డేలో ఇషాన్ కిషన్ కి చోటు కల్పించకపోవటంపై ఫ్యాన్స్ టీమిండియా మేనేజిమెంట్ ని విమర్శిస్తున్నారు.

గిల్ దయచేసి 200 కొట్టకండి. లేకుంటే మీరు కూడా బెంచ్‌ కే పరిమితం అవ్వాల్సి వస్తది ఇషాన్ కిషన్ మాదిరిగా అని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. సూర్య కుమార్ ని జట్టులో చూడటం బాగుంది. ఇషాన్ కిషన్‌ను చూడాలని అనుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు.