Site icon HashtagU Telugu

Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్

Ishan Kishan

Ishan Kishan

Ishan Kishan: వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా టీమిండియా దూరంగా ఉన్నాడు. దేశవాళీ టోర్నీలో ఆడేందుకు నిరాకరించిన ఇషాన్ కిషన్ బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో అతను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయాడు. ఫలితంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నట్టు లెక్క. ఇదిలా ఉండగా కిషన్ కు బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. దీంతో త్వరలో జరగనున్న బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ టోర్నీ ఆగస్టు 15 నుంచి తమిళనాడులో ప్రారంభం కానుంది. ఇదివరకు జార్ఖండ్ జట్టులో ఇషాన్ కిషన్ ఎంపికకాలేదు. అయితే బీసీసీఐ అతడికి మరో ఛాన్స్ ఇవ్వడంతో రేపు బుధవారం ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇషాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి తిరిగి రావడానికి తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇషాన్ కిషన్ తన నిర్ణయం గురించి జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేసాడు. దీంతో అతనిని వెంటనే జట్టులోకి తీసుకున్నారు.దంతర్వాత ఇషాన్ కిషన్ 2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో భాగమవుతాడని ఆశిస్తున్నారు. 2023-24 రంజీ సీజన్ చివరి రోజుల్లో అతను దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కిషన్ తీసుకున్న ఈ నిర్ణయం అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో బీసీసీఐ అతడిని వార్షిక కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. కాగా వచ్చే ఐదు నెలల్లో భారత్ 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

బుచ్చిబాబు టోర్నీ తర్వాత ఇషాన్ కిషన్ టీమిండియా ఆడనున్న టెస్ట్ సిరీస్ లకు ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే కొందరి అభిప్రాయాలను చూస్తే సెప్టెంబర్ 5న ప్రారంభమై సెప్టెంబర్ 24న ముగిసే దులీప్ ట్రోఫీకి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇషాన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇదే విషయం హైలెట్ చేసి చెప్పింది.

Also Read: Anti Tank Missiles : ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే యాంటీ ట్యాంక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్