Site icon HashtagU Telugu

Ishan Kishan@200: ఇషాన్ కిషన్ దూకుడు.. డబుల్ సెంచరీతో బంగ్లా బేంబేలు!

Ishan

Ishan

భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేరీర్ లో అత్యుత్తంగా రాణించి 200 (Double Century) సెంచరీ కొట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగిన యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ((Ishan Kishan), విరాట్ కోహ్లీతో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కోహ్లీ సహకారంతో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో 49 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్ 85 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటాడు. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 126 బంతుల్లో 200 (Double Century) సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఈ 26 ఏళ్ల క్రికెటర్. కోహ్లీ సైతం 88 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇదే జోరును కొనసాగిస్తే టీంఇండియా 400 స్కోరు దాటేలా ఉంది.

బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో భారత్ (Team India) బ్యాటింగ్ లో దంచికొడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగుకు వచ్చిన బారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. మూడు వికెట్ల నష్టానికి 330 స్కోరు దాటింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ మరోసారి నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన అతను 8 బంతుల్లో మూడే పరుగులు చేశాడు. ఐదో ఓవర్లోనే స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. యువ క్రికెటర్ ఇషాన్ (Ishan Kishan) 210 కొట్టి పెవిలియన్ కు చేరుకున్నాడు.

Also Read: KTR Warning: బాసర అధికారులపై కేటీఆర్ ఫైర్!